News April 16, 2025

దిలావర్పూర్‌: జీవనోపాధికి వచ్చి మృత్యుఒడికి చేరి

image

దిలావర్పూర్ మండలం సిర్గాపూర్ వద్ద జరిగిన యాక్సిడెంట్‌లో ఒకరు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుడు MHలోని హిమాయత్‌నగర్ తాలుక దబ్దారికి చెందిన వ్యక్తి. 4 నెలల కిందట కుటుంబంతో బతుకుదెరువు కోసం సముందర్‌పల్లిలోని ఇటుక బట్టీల్లో కార్మికులుగా చేరారు. మంగళవారం జరిగిన ప్రమాదంలో రాజు మృతి చెందగా.. కొడుకు చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు. రాజు భార్య లక్ష్మిబాయి, కూతురు దిక్కుతోచని స్థితిలోకి వెళ్లారు.

Similar News

News April 17, 2025

వనపర్తి: ‘వక్ఫ్ సవరణ చట్టం రద్దు చేయాలి’

image

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన వక్ఫ్ బోర్డు చట్టాన్ని రద్దు చేయాలని ఆవాజ్ రాష్ట్ర నాయకుడు MD జబ్బార్ డిమాండ్ చేశారు. గురువారం ఆవాజ్ వనపర్తి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని అన్ని పార్టీల నాయకులు, ప్రజా సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. వక్ఫ్ సవరణ చట్టం రద్దు చేసే వరకు ఉద్యమం కొనసాగిస్తామని నాయకులు స్పష్టం చేశారు.

News April 17, 2025

బషీర్‌బాగ్‌: ఎడ్యుకేషన్ పాలసీ-2020పై సెమినార్

image

బషీర్‌బాగ్‌లోని SCERT కార్యాలయంలో తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ ఆధ్వర్యంలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ-2020పై సెమినార్ జరిగింది. కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రొ.హరగోపాల్, ప్రొ.శాంత సిన్హా, ప్రొ.రామ మేల్కొటి, ప్రొ.కోదండరాం తదితరులు పాల్గొని వ్యాసాలు సమర్పించారు.

News April 17, 2025

గిట్టుబాటు ధర లేదు.. ఉపాధి కూలీలకు డబ్బు చెల్లించట్లేదు: బొత్స

image

AP: కూటమి నేతల మాటలకు, చేతలకు పొంతన లేదని మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. అధికార పార్టీ నేతలు డబ్బు డిమాండ్ చేస్తుండటంతో పరిశ్రమలు వెనక్కిపోతున్నాయని ఆరోపించారు. గిట్టుబాటు ధర లేక మిర్చి రైతులు అల్లాడిపోతున్నారని, ఉపాధి కూలీలకూ డబ్బులు చెల్లించట్లేదని ఫైరయ్యారు. 10 నెలల్లో ఒక్కరికైనా కొత్తగా పెన్షన్ ఇచ్చారా? అని నిలదీశారు. హామీలపై ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.

error: Content is protected !!