News April 16, 2025
నాగర్‌కర్నూల్: ఆ టీచర్‌కు షోకాజ్ నోటీసులు

నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని నాగనూలు కస్తూర్బా పాఠశాల ఉపాధ్యాయిని కళ్యాణికి ఉన్నతాధికారులు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. రెండు రోజుల క్రితం 9వ తరగతి చదువుతున్న యామిని ఆలస్యంగా వచ్చిందని సదరు టీచర్ మందలించి 3 గంటలు పనిష్మెంట్ ఇచ్చింది. మనస్తాపానికి గురైన యామిని ఆత్మహత్యకు యత్నించింది. విద్యార్థినులు మంగళవారం పాఠశాల ముందు ఆందోళన చేశారు. స్పందించిన అధికారులు టీచర్‌కు షోకాజ్ నోటీసులు పంపారు.
Similar News
News April 17, 2025
అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్‌కు ఉద్వాసన!

టీమ్ ఇండియా అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్‌కు BCCI ఉద్వాసన పలకనున్నట్లు తెలుస్తోంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత పేలవ ప్రదర్శనకు బాధ్యుడిని చేస్తూ అతడిని తప్పిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే ఫీల్డింగ్ కోచ్ దిలీప్, ట్రైనర్ సోహమ్ దేశాయ్‌ను కూడా వదిలేస్తున్నట్లు సమాచారం. కాగా అభిషేక్‌ను 7 నెలల క్రితమే బీసీసీఐ అసిస్టెంట్ కోచ్‌గా నియమించింది. స్వల్పకాలంలోనే అతడిని పక్కనబెట్టబోతోంది.
News April 17, 2025
భువనగిరిలో భారీగా గంజాయి పట్టివేత

భువనగిరిలో బుధవారం దాదాపు 51.13 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. 24 ప్యాకెట్ల గంజాయి మొత్తం విలువ రూ. 14.50 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ముగ్గురు నిందితులు మహమ్మద్ ఆమిర్, మహమ్మద్ ఇస్మాయిల్, మహమ్మద్ ఇస్మాయిల్ పట్టుబడ్డారు. మరో నిందితుడు బాషా పరారీలో ఉన్నట్లు తెలిపారు. వారి వద్ద నుంచి కారు, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
News April 17, 2025
అమ్మాయి ఎర.. HYDలో చెత్త కల్చర్!

HYD పబ్బుల్లో గబ్బు కల్చర్ పెరుగుతోంది. యువతను ఆకర్షిస్తూ కొందరు ఈ దందాకు తెరలేపుతున్నారు. అమ్మాయిలను ఎరవేస్తున్న నిర్వాహకులు కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. ఒంటరిగా మందు తాగుదామని వస్తే యువతులతో కంపెనీ అని బిల్లులు గట్టిగానే వేస్తున్నారు. పోలీసులు చెక్ పెడుతున్నా.. ఈ తరహా ఘటనలు నగరంలో వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఇక OYO హోటల్స్, కో-లివింగ్ కల్చర్ కూడా గ్రేటర్‌లో పుట్టగొడుగుల్లా విస్తరించడం గమనార్హం.