News April 16, 2025

ఏప్రిల్ 16: చరిత్రలో ఈరోజు

image

1848: సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు(ఫొటోలో) జననం
1889: హాస్యనటుడు చార్లీ చాప్లిన్ జననం
1910: సాహితీవేత్త ఎన్ఎస్ కృష్ణమూర్తి జననం
1914: చిత్రకారుడు కేహెచ్ ఆరా జననం
1951: హాస్యనటుడు ఎంఎస్ నారాయణ జననం
1853: భారత్‌లో తొలి పాసింజర్ రైలును బ్రిటిష్ ప్రభుత్వం ప్రారంభించింది

Similar News

News April 16, 2025

ఫైబర్‌నెట్‌లో ఉద్యోగుల తొలగింపు

image

AP ఫైబర్‌నెట్‌లో ఉద్యోగులను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సూర్య ఎంటర్‌ప్రైజెస్ ద్వారా నియమించిన వారంతా ఈ నెలాఖరులోగా రిలీవ్ కావాలని ఆదేశించింది. ఇకపై ఎలాంటి పొడిగింపు ఉండదని స్పష్టం చేసింది. తొలగించిన వారిలో 500 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఫైబర్‌నెట్ నియామకాలు ఇష్టారీతిన జరిగాయని, కొందరు ఆఫీసులకు రాకుండానే జీతాలు తీసుకున్నట్లు ప్రభుత్వం గుర్తించి చర్యలు తీసుకున్నట్లు సమాచారం.

News April 16, 2025

బెంగాల్‌ను అప్రతిష్ఠపాలు చేసే కుట్ర: మమత

image

బెంగాల్‌ను భ్రష్టు పట్టించేందుకు కేంద్రం మీడియాను వాడుతోందని CM మమతా బెనర్జీ ఆరోపించారు. కొన్ని మీడియా సంస్థలను మోదీ పోషిస్తున్నారని విమర్శించారు. UP, కర్ణాటక, బిహార్‌, రాజస్థాన్‌కు చెందిన వీడియోలతో బెంగాల్‌ను అప్రతిష్ఠపాలు చేయాలని ప్రయత్నిస్తున్నారన్నారు. యువతకు ఎన్ని ఉద్యోగాలొచ్చాయి?, పెరిగిన పెట్రోల్, డీజిల్, మెడిసిన్స్ ధరల గురించి మాట్లాడాలంటూ సవాల్ చేశారు.

News April 16, 2025

ఇన్‌స్టా ఫాలోయింగ్‌పై పూజా హేగ్డే ఇంట్రెస్టింగ్ కామెంట్స్

image

సోషల్ మీడియాలో ఉన్న ఫాలోవర్ల సంఖ్య బాక్సాఫీసును డిసైడ్ చేయలేదని హీరోయిన్ పూజా హెగ్డే అన్నారు. ‘నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో 30 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉండొచ్చు. కానీ వారందరూ థియేటర్లకు వస్తారని కాదు. చాలా మంది సూపర్ స్టార్లకు 5 మిలియన్ల కంటే తక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారు. సోషల్ మీడియాకు, వాస్తవానికి చాలా తేడా ఉందని అర్థం చేసుకోండి’ అని ఆమె తెలిపారు.

error: Content is protected !!