News April 16, 2025

కొత్తగూడెం: యువతి చదువుకు బాబుమోహన్ భరోసా

image

కొత్తగూడెం(D) అశ్వారావుపేటకు చెందిన యువతి చదువుకు ప్రముఖ నటుడు బాబు మోహన్ భరోసానిస్తూ ముందుకు వచ్చారు. మండలంలోని బండారిగుంపునకు చెందిన బైట గోపాలరావు రెండో కుమార్తె సమీప బీటెక్ పూర్తి చేసింది. ఎంటెక్ చదవడానికి బాబుమోహన్ ముందుకు వచ్చి తన కుమారుడి ట్రస్ట్ పేరు మీద చదువు పూర్తి చేయిస్తానని హామీనిచ్చారు. చదువు పూర్తిచేసి ఫారెస్ట్ రేంజ్ అధికారిణి అవుతానని సమీప ఆయనకు తెలిపింది.

Similar News

News April 16, 2025

ఇండియన్ రైల్వే‌స్‌కు నేటితో 172 ఏళ్లు పూర్తి: అశ్వినీ వైష్ణవ్

image

భారతీయ రైల్వే వ్యవస్థ ప్రారంభమై నేటితో 172 సంవత్సరాలు పూర్తయ్యాయని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ ట్వీట్ చేశారు. 1853 ఏప్రిల్ 16న బోరిబందర్- ముంబై-థానే మధ్య, సింద్, సుల్తాన్, సాహిబ్ అనే మూడు ఇంజిన్లతో రైలు నడిచిందని తెలిపారు. తొలి రైలులో 400మంది ప్యాసింజర్లు ఉండగా 34 కిలోమీటర్లు ప్రయాణం చేసిందని పేర్కొన్నారు. అప్పటి నుంచి నేటి వరకూ భారతీయ రైల్వే నిరంతరాయంగా సేవలందిస్తోందని ట్వీట్ చేశారు.

News April 16, 2025

NZB: ప్రభుత్వ ఆసుపత్రిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

image

నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు 1 టౌన్ SHO రఘుపతి తెలిపారు. ఆసుపత్రిలోని రేకుల షెడ్డు వద్ద ఓ వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉండడంతో కానిస్టేబుల్ చికిత్స నిమిత్తం తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి వయసు 45-50 ఏళ్ల మధ్య ఉండొచ్చని అంచనా వేశారు. వివరాలు తెలిసిన వారు 8712659714 నంబర్‌కు సంప్రదించాలన్నారు.

News April 16, 2025

నగ్న చిత్రాలతో బ్లాక్ మెయిల్.. నిందితుడి అరెస్ట్

image

డబ్బు కోసం యువతిని నగ్న చిత్రాలతో బెదిరిస్తున్న కర్నూలు(D) కల్లూరు(M) తటకనాపల్లికి చెందిన హరీశ్‌ను అరెస్టు చేసినట్లు ఆలమూరు SI అశోక్ తెలిపారు. కోర్టులో హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు చెప్పారు. మూడేళ్ల క్రితం ఓ యాప్ ద్వారా యువతి పరిచయమైందని తెలిపారు. నగ్నంగా వీడియో కాల్ మాట్లాడటంతో స్క్రీన్ షాట్స్ తీసి మూడు ఇన్‌స్టా ఖాతాల్లో పోస్ట్ చేసి వేధించాడని వెల్లడించారు.

error: Content is protected !!