News April 16, 2025
అమల్లోకి భూభారతి చట్టం: హనుమకొండ కలెక్టర్

ధరణి స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన భూభారతి చట్టం జిల్లాలో అమల్లోకి వచ్చిందని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. మంగళవారం హనుమకొండ కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో ధరణి స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన భూభారతి చట్టానికి సంబంధించిన మార్గదర్శకాలపై జిల్లాలోని తహశీల్దార్లు, నాయబ్ తహశీల్దార్లు, రెవెన్యూ విభాగం సూపరింటెండెంట్లకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
Similar News
News September 13, 2025
విశాఖ చేరుకున్న జేపీ నడ్డా

విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లో జగత్ ప్రకాష్ నడ్డాకు శనివారం ఘన స్వాగతం లభించింది. రేపు జరగనున్న సారథ్యం బహిరంగ సభలో పాల్గొనడానికి ఆయన నగరానికి చేరుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, మంత్రి సత్యకుమార్ యాదవ్‌తో కలిసి అనకాపల్లి ఎంపీ సీఎం.రమేశ్ పుష్పగుచ్ఛం అందజేసి ఆత్మీయంగా స్వాగతం పలికారు.
News September 13, 2025
సమన్వయంతో పని చేసి జిల్లాభివృద్ధికి దోహదపడాలి: కలెక్టర్

పార్వతీపురం మన్యం జిల్లా అధికారులందరూ సమన్వయంతో పని చేసి జిల్లాభివృద్ధికి దోహదపడాలని జిల్లా కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లా అధికారులతో ఆయన సమీక్షా సమావేశాన్ని కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం నిర్వహించారు. జిల్లా అధికారులందరూ ఒక టీమ్‌గా పనిచేసి, ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలు లక్ష్యసాధనలో గడువుకు ముందే ప్రగతిని సాధించాలని స్పష్టం చేశారు.
News September 13, 2025
సంక్షేమ పథకాలపై ప్రజల్లో సంతృప్తే ముఖ్యం: CM చంద్రబాబు

AP: 15% వృద్ధి రేటు లక్ష్యంగా పని చేయాలని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ నెల 15, 16 తేదీల్లో నిర్వహించనున్న కలెక్టర్ల కాన్ఫరెన్స్‌పై మంత్రులు, అధికారులతో ఆయన సమావేశమయ్యారు. పౌరసేవలతో పాటు సంక్షేమ పథకాలపై ప్రజల్లో సంతృప్తే ముఖ్యమని, దానికి అనుగుణంగానే మంత్రులు, ప్రజాప్రతినిధులు పని చేయాలని ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో 3% వృద్ధి తగ్గడంతో రాష్ట్రం సుమారుగా రూ.6 లక్షల కోట్ల సంపదను కోల్పోయిందన్నారు.