News April 16, 2025

వెంటనే నివేదికలు పంపండి: నాగర్‌కర్నూల్ ఎంపీ 

image

నాగర్‌కర్నూల్ జిల్లాలో ఇటీవల కురిసిన ఆకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతుల నివేదికలను వెంటనే పంపాలని ఎంపీ డాక్టర్ మల్లురవి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మండలాల తహశీల్దార్లు మామిడి, వరి, ఇతర పంటలను నష్ట పోయిన రైతుల వివరాలను కలెక్టరేట్‌లో అందివ్వాలని ఆయన అన్నారు. ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం పనిచేస్తోందని, రైతులకు పరిహారం అందించేందుకు కృషి చేస్తానని అన్నారు.

Similar News

News April 16, 2025

ఎంపీల అటెండెన్స్.. టాప్ ఎవరంటే?

image

TG: 24 జూన్ 2024 – 4 ఏప్రిల్ 2025 మధ్య పార్లమెంట్ సమావేశాలకు కాంగ్రెస్ MP చామల కిరణ్ కుమార్ 100 శాతం హాజరయ్యారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి 95 శాతం హాజరు నమోదు చేశారు. BJP MP ఈటల రాజేందర్ అత్యధికంగా 80 ప్రశ్నలు వేసి 91 శాతం సమావేశాలకు హాజరయ్యారు. డీకే అరుణ 73 ప్రశ్నలు అడిగి 88 శాతం హాజరయ్యారు. MIM MP అసదుద్దీన్ 21 చర్చల్లో పాల్గొన్నారు. నల్గొండ MP రఘువీర్ అతి తక్కువగా 8 ప్రశ్నలే అడిగారు.

News April 16, 2025

ఇండియన్ రైల్వే‌స్‌కు నేటితో 172 ఏళ్లు పూర్తి: అశ్వినీ వైష్ణవ్

image

భారతీయ రైల్వే వ్యవస్థ ప్రారంభమై నేటితో 172 సంవత్సరాలు పూర్తయ్యాయని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ ట్వీట్ చేశారు. 1853 ఏప్రిల్ 16న బోరిబందర్- ముంబై-థానే మధ్య, సింద్, సుల్తాన్, సాహిబ్ అనే మూడు ఇంజిన్లతో రైలు నడిచిందని తెలిపారు. తొలి రైలులో 400మంది ప్యాసింజర్లు ఉండగా 34 కిలోమీటర్లు ప్రయాణం చేసిందని పేర్కొన్నారు. అప్పటి నుంచి నేటి వరకూ భారతీయ రైల్వే నిరంతరాయంగా సేవలందిస్తోందని ట్వీట్ చేశారు.

News April 16, 2025

NZB: ప్రభుత్వ ఆసుపత్రిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

image

నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు 1 టౌన్ SHO రఘుపతి తెలిపారు. ఆసుపత్రిలోని రేకుల షెడ్డు వద్ద ఓ వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉండడంతో కానిస్టేబుల్ చికిత్స నిమిత్తం తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి వయసు 45-50 ఏళ్ల మధ్య ఉండొచ్చని అంచనా వేశారు. వివరాలు తెలిసిన వారు 8712659714 నంబర్‌కు సంప్రదించాలన్నారు.

error: Content is protected !!