News April 16, 2025
SUPER.. గిన్నిస్ రికార్డు కొట్టిన నాగర్‌కర్నూల్ వాసి

నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ గ్రామ పంచాయతీ పరిధి కంటోనిపల్లి గ్రామానికి చెందిన అయినాల డేనియల్ రాజ్‌కు వరల్డ్ గిన్నిస్ బుక్‌లో చోటు దక్కింది. 2024 డిసెంబర్ 1న 1,046 మంది ఆన్‌లైన్‌లో ఒకేసారి గంట సేపు కీబోర్డు ప్లే ఈవెంట్లో ఆయన పాల్గొన్నారు. గిన్సిస్ బుక్ నిర్వాహకులు హైదరాబాద్‌లోని మణికొండలో మంగళవారం రాజుకు రికార్డు పత్రాన్ని ప్రదానం చేశారు.
Similar News
News April 16, 2025
NGKL: సెలవుల్లో.. నల్లమల స్వాగతం పలుకుతోంది!

వేసవి సెలవులకు నాగర్ కర్నూలు జిల్లా స్వాగతం పలుకుతోంది. సెలవుల్లో కుటుంబ సమేతంగా పచ్చని అడవులలో ఆహ్లాదకర వాతావరణంలో టూర్ ప్లాన్ చేసుకునేలా మంచి వేదిక కానుంది. అచ్చంపేట ఉమామహేశ్వరం శివాలయం, పచ్చని వాతావరణం, కొండలు, గుట్టలు కలిగి ఉన్న ప్రాంతం, అమ్రాబాద్ పబ్బతి ఆంజనేయ స్వామి టెంపుల్ చూడ చక్కని ప్రదేశం. పర్యాటక ప్రాంతాలు సందర్శించి పచ్చని చెట్ల మధ్య విందు చేస్తూ ఆహ్లాదం పొందవచ్చు.
News April 16, 2025
గిన్నిస్ రికార్డు సాధించిన ఏలూరు జిల్లా బాలుడు

కుక్కునూరు మండలం వెంకటాపురం చెందిన శెట్టి మోక్షిత్ రిషి నిహార్ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. సంగీతంలో వరల్డ్ రికార్డుతో పాటు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ సాధించాడు. గత 6 నెలల వ్యవధిలో కీ బోర్డులో మెలకువలు నేర్చుకొని వరల్డ్ గిన్నీస్ బుక్ ఆఫ్ అసోసియేషన్ వారిని సంప్రదించారు. వారి దగ్గర సమ్మతి పత్రం తీసుకొని 18 దేశాల సంగీత విద్వాంసులలో ఒకేసారి మ్యూజిక్ ప్లే చేసి రికార్డు సాధించాడు.
News April 16, 2025
ఎంపీల అటెండెన్స్.. టాప్ ఎవరంటే?

TG: 24 జూన్ 2024 – 4 ఏప్రిల్ 2025 మధ్య పార్లమెంట్ సమావేశాలకు కాంగ్రెస్ MP చామల కిరణ్ కుమార్ 100 శాతం హాజరయ్యారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి 95 శాతం హాజరు నమోదు చేశారు. BJP MP ఈటల రాజేందర్ అత్యధికంగా 80 ప్రశ్నలు వేసి 91 శాతం సమావేశాలకు హాజరయ్యారు. డీకే అరుణ 73 ప్రశ్నలు అడిగి 88 శాతం హాజరయ్యారు. MIM MP అసదుద్దీన్ 21 చర్చల్లో పాల్గొన్నారు. నల్గొండ MP రఘువీర్ అతి తక్కువగా 8 ప్రశ్నలే అడిగారు.