News April 16, 2025
గద్వాల: ‘జూరాల కుడికాలువకు నీటిని విడుదల చేయాలి’

జూరాల ప్రాజెక్టు కుడికాలువకు సాగునీటిని విడుదల చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకటస్వామి డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. కుడి కాల్వ ఆయకట్టు కింద రైతులు వరి సాగు చేపట్టారని అన్నారు. రేవులపల్లి, గుంటిపల్లి, కొత్తపల్లి గ్రామాలకు చెందిన రైతులు సాగు నీటిని విడుదల చేస్తామనడంతో వరి పంటను వేశారన్నారు. ఇంత వరకు నీటిని విడుదల చేయలేదన్నారు.
Similar News
News September 18, 2025
3 రోజుల పాటు బీచ్ ఫెస్టివల్

AP: ఈ నెల 26 నుంచి 28 వరకు 3 రోజుల పాటు బాపట్ల జిల్లాలోని సూర్యలంకలో బీచ్ ఫెస్టివల్ జరగనుంది. ఇందులో భాగంగా సాహస క్రీడలు, ఎగ్జిబిషన్, లేజర్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు, ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. ఈ నెల 27న సీఎం చంద్రబాబు బీచ్‌ను సందర్శించి, రూ.97 కోట్ల అభివృద్ధి పనులుకు శంకుస్థాపన చేస్తారని ప్రభుత్వం తెలిపింది. బాపట్ల పట్టణం నుంచి సూర్యలంక బీచ్ 9 కి.మీ దూరం ఉంటుంది.
News September 18, 2025
సభా సమయం.. జిల్లా నేతల సంసిద్ధం!

నేటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఉమ్మడి అనంతపురం జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. ఇప్పటికే నేతలంతా విజయవాడకు చేరుకున్నారు. జిల్లాలో రోడ్లు, ప్రాజెక్టుల నిర్మాణం వంటి అంశాలపై గళమెత్తనున్నారు. కొడికొండ వద్ద 23 వేల ఎకరాల్లో పారిశ్రామిక పార్కు ఏర్పాటుపై చర్చించే అవకాశముంది. మరోవైపు YCP నాయకులు అసెంబ్లీకి వస్తే ఏ అంశంపైనైనా చర్చకు సిద్ధంగా ఉన్నామని మంత్రి సవిత ప్రకటించారు.
News September 18, 2025
గుంటూరులో అతిసార కేసులపై కలెక్టర్ సమీక్ష

గుంటూరులో డయేరియా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా వైద్య అధికారులను అప్రమత్తం చేశారు. కేసులపై తక్షణమే నివేదిక సమర్పించాలని, వ్యాధి విస్తరించకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలు భయపడకుండా అవగాహన కల్పించాలని, ఆసుపత్రుల్లో చేరిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఇంటింటి సర్వే చేసి, పరిశుభ్రమైన తాగునీటిని అందించాలని అధికారులను ఆదేశించారు.