News April 16, 2025
అయిజ: 16 నెలలయినా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు: BRSV

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 16 నెలలైనా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదని బీఆర్ఎస్వీ జిల్లా కన్వీనర్ కురువ పల్లయ్య ఆరోపించారు. మంగళవారం అయిజ మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులను నిండా ముంచిందని ఆయన అన్నారు. 6,000 ఉద్యోగాలు ఇచ్చి 60 వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరుద్యోగులను మోసం చేస్తోందని మండిపడ్డారు.
Similar News
News April 22, 2025
నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు: నెల్లూరు కలెక్టర్

భూ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని నెల్లూరు కలెక్టర్ ఆనంద్ అధికారులను హెచ్చరించారు. కలెక్టరేట్‌లో ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. వివిధ సమస్యలపై ప్రజలు అందించిన అర్జీలను జాప్యం లేకుండా వెంటనే పరిష్కరించేందుకు ఆయా శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. భూసమస్యలు, రెవెన్యూ అంశాలకు సంబంధించి ఫిర్యాదులు వచ్చాయన్నారు.
News April 22, 2025
గుంటూరు జిల్లాలో తీవ్ర ఉత్కంఠ

రేపు టెన్త్ ఫలితాలు విడుదల కానున్న తరుణంలో గుంటూరు జిల్లా విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. జిల్లాలోని 150 పరీక్షా కేంద్రాల్లో 29,459 మంది రెగ్యులర్, ప్రైవేటుగా మరో 961 మంది విద్యార్థులు తమ భవిష్యత్తు ఆశలతో పరీక్షలు రాశారు. ఇప్పుడు ఫలితాల వేళ… ఒక్కో సెకనూ గంటలా మారింది. ప్రతి ఒక్కరికీ తమ ఫలితం మీద ఎన్నో ఆశలు.. ఎన్నో లక్ష్యాలు.. పెట్టుకుని ఉన్నారు. రిజల్ట్స్ కోసం Way2News ఫాలో అవ్వండి.
News April 22, 2025
పోలీసు కస్టడీకి గోరంట్ల మాధవ్

AP: వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను రెండ్రోజులు పోలీసు కస్టడీకి అనుమతిస్తూ గుంటూరు మొబైల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసులు 5 రోజులు కోరగా.. కోర్టు రెండ్రోజులు అనుమతించింది. గోరంట్లను ఈ నెల 23, 24 తేదీల్లో పోలీసులు విచారించనున్నారు. పోలీసు కస్టడీలో ఉన్న చేబ్రోలు కిరణ్‌పై గోరంట్ల దాడికి యత్నించారని కేసు నమోదైంది. ప్రస్తుతం గోరంట్ల రాజమహేంద్రవరం జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.