News March 27, 2024
ఎచ్చెర్ల నియోజకవర్గ ఉమ్మడి కూటమి అభ్యర్థిగా ఈశ్వరరావు

ఎచ్చెర్ల నియోజకవర్గ బీజేపీ-జనసేన-టీడీపీ ఉమ్మడి కూటమి అభ్యర్థిగా నడుకుదిటి ఈశ్వరరావును (ఎన్ఈఆర్) బీజేపీ అధిష్ఠానం ప్రకటించింది. రణస్థలం మండలం బంటుపల్లి పంచాయతీ నడుకుదిటిపాలెంకు చెందిన ఈయన తొలిసారిగా 2014లో టీడీపీలో చేరారు. 2019 ఎన్నికల తరువాత.. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ పట్ల ఆకర్షితుడైన ఎన్ఈఆర్ బీజేపీలో చేరారు. ఈయన ప్రస్తుతం విజయనగరం జిల్లా బీజేపీ అధ్యక్షునిగా కొనసాగుతున్నారు.
Similar News
News September 29, 2025
శ్రీకాకుళం జూనియర్ లెక్చరర్ సంఘ అధ్యక్షుడిగా మల్లేష్

శ్రీకాకుళం జిల్లా జూనియర్ లెక్చరర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా డాక్టర్ హెచ్ మల్లేష్ ఎన్నికయ్యారు. ఆదివారం శ్రీకాకుళం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన కార్యవర్గ ఎన్నికలు నిర్వహించామని ఎన్నికల అధికారి నారాయణరావు ప్రకటించారు. ఉపాధ్యక్షుడిగా బి వెంకట మోహన్, కార్యదర్శిగా రమేష్, జాయింట్ సెక్రటరీగా పెనుగుదురు ప్రసాదరావు ఎన్నికయ్యారని ఆయన వివరించారు. కార్యవర్గ సభ్యులను కూడా నియమించారు.

News September 28, 2025
శ్రీకాకుళం జిల్లాలో టుడే టాప్ న్యూస్ ఇవే

★టెక్కలి: పాముకాటుకు రైతు మృతి
★కాశీబుగ్గ: బండి ముందుకెళ్తే.. గుంతలోకి చక్రం
★శ్రీకాకుళం: ఫోటోగ్రఫీ కళా ప్రదర్శన పోటీలకు ఆహ్వానం
★ టెక్కలి: లేడీస్ కార్నర్‌లో అగ్నిప్రమాదం
★ కంచిలి సంతలో ట్రాఫిక్ కష్టాలు
★ శ్రీకాకుళం మున్సిపల్ కార్పోరేషన్‌కు 78వ ర్యాంకు
★ జిల్లాలో పలుచోట్ల వైసీపీ డిజిటల్ బుక్‌పై కార్యక్రమాలు
★ శ్రీకాకుళం జిల్లాలో కొనసాగుతున్న దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు