News April 16, 2025
HYDలో గంటకు 200 కేసులు

10, 20 కాదు గంటకు 200 కేసులు నమోదవుతున్నాయి. ఈ పరిస్థితి ఎక్కడో కాదు HYDలో. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో రాంగ్ రూట్లో వెళ్లే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు 3 నెలల్లో 4,32,824 రాంగ్ రూట్ డ్రైవింగ్ కేసులు నమోదయ్యాయి. HYDలో 1,62,000 కేసులు, రాచకొండలో 53,824, సైబరాబాద్‌లో 2,17,000 కేసులు నమోదయ్యాయని రికార్డులు చెబుతున్నాయి.
Similar News
News April 16, 2025
Caratlane ఫ్రాంచైజీతో జ్యువెల్లరీ రంగంలోకి ‘కమల్ వాచ్’

కమల్ వాచ్ కంపనీ జ్యువెల్లరీ రంగంలో అడుగుపెడుతూ హైదారాబాద్ గచ్చిబౌలిలో మొదటి Caratlane ఫ్రాంచైజీని టోట్ల ఫ్యామిలీతో కలిసి ప్రేమలతా భాయ్ టోట్ల ప్రారంభించారు. గచ్చిబౌలిలో గూగుల్ కార్యాలయం ఎదురుగా ఈ మొట్టమొదటి నూతన షోరూమ్‌ను కమల్ వాచ్ ఏర్పాటు చేసింది. ఐదు రాష్ట్రాలలో 56 వాచ్ స్టోర్లు, Swarovski అవుట్‌లెట్లు మరియు లగేజ్ స్టోర్లతో పాటు ఈ కొత్త ప్రారంభంతో తమ వ్యాపారంలో వైవిధ్యతను ప్రకటించారు.
News April 16, 2025
‘బిర్లా టెంపుల్‌లోకి వెళ్లేందుకు దారి చూపండి’

నగరంలోని బిర్లా టెంపుల్‌ను రోజూ వేలాది మంది భక్తులు సందర్శించుకుంటున్నారు. అయితే భక్తులు ఆలయంలోకి వెళ్లాలంటే ఇబ్బంది పడుతున్నారు. దారికి ఇరువైపులా చిరు వ్యాపారులు ఉంటారు. రద్దీ రోజుల్లో ఆలయంలోకి వెళ్లాలంటే ముందుకు వెళ్లడమే కష్టంగా ఉంటుంది. రోజూ ఈ సమస్య ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదు. సమస్యను ఇప్పటికైనా తీర్చాలని పలువురు కోరుతున్నారు.
News April 16, 2025
బాచుపల్లి: నమ్మించి మోసం చేశాడు

పెళ్లికాలేదు.. నిన్నే చేసుకుంటా అని నమ్మించి యువతి (21)ని గర్భవతిని చేసి మొహం చాటేశాడో కామాంధుడు. ఆ యువతి పోలీసులను ఆశ్రయించగా కటకటాల పాలయ్యాడు. సీఐ ఉపేందర్ మాటల్లో.. ఇల్లెందుకు చెందిన బి.ఏసుదాస్ డేవిడ్ (43) మల్లంపేటలో ఉంటూ ఓ యువతిని ప్రేమిస్తున్నాను అంటూ మల్లంపేటలోని హోటళ్లకు తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. గర్భం దాల్చడంతో పెళ్లి చేసుకోమని యువతి ఒత్తిడి తేగా మొహం చాటేశాడు.