News April 16, 2025
కలికిరి: పోక్సో కేసులో నిందితుడు అరెస్ట్: సీఐ

ఇటీవల 14ఏళ్ల బాలికపై హరి(63) బలాత్కారం చేశాడనే ఫిర్యాదుతో కలికిరి పోలీస్ స్టేషన్‌లో పోక్సో కేసు నమోదు చేశారు. మదనపల్లి ఎస్డీపీవో ఆధ్వర్యంలో తట్టివారిపల్లి వద్ద ఉన్న నిందితుడిని సీఐ రెడ్డి శేఖర్ రెడ్డి తమ సిబ్బందితో వెళ్లి అరెస్టు చేసి సోమవారం సాయంత్రం వాల్మీకిపురం కోర్టులో హాజరుపరిచారు. జడ్జి 14 రోజులు రిమాండ్ విధించారని సీఐ తెలిపారు.
Similar News
News September 18, 2025
2030 నాటికి 1.14 లక్షల మందికి ఉపాధి: భట్టి

TG: గ్రీన్ ఎనర్జీ పాలసీ ద్వారా రూ.1.98 లక్షల కోట్ల పెట్టుబడితో 20 వేల మెగావాట్ల రీ యూజబుల్ ఎనర్జీ ఉత్పత్తి చేస్తామని Dy.CM భట్టి విక్రమార్క తెలిపారు. ‘2030 నాటికి ఈ పాలసీతో 1.14 లక్షల మందికి ఉపాధి లభిస్తుంది. మహిళా సంఘాల ద్వారా 2 వేల మెగావాట్ల సోలార్ ఎనర్జీ ఉత్పత్తికి రంగం సిద్ధమైంది. అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇచ్చాం. ప్రతి వ్యక్తికి 6 కిలోల సన్నబియ్యం పంపిణీ చేస్తున్నాం’ అని తెలిపారు.
News September 18, 2025
VKB: అత్త శ్రద్ధాంజలి బ్యానర్ తీసుకెళ్తూ అల్లుడు మృతి

VKB జిల్లా పుల్‌మద్ది గ్రామంలో వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. గ్రామానికి చెందిన లక్ష్మి మరణించడంతో ఆమె శ్రద్ధాంజలి బ్యానర్‌ని అల్లుడు శ్రీనివాస్ పట్టణంలో ప్రింట్ చేసుకొని తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో రోడ్డు గుంతలో బైక్ పడి కింద పడడంతో వెనుక నుంచి వేగంగా వచ్చిన డీసీఎం వాహనం శ్రీనివాస్‌పై నుంచి వెళ్లింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అత్త, అల్లుడు మరణంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
News September 18, 2025
నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు

AP: ఇవాళ్టి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. 10 రోజుల వరకు సభ నిర్వహించే అవకాశముంది. పంచాయతీరాజ్ సవరణ, AP మోటార్ వెహికల్ ట్యాక్స్, SC వర్గీకరణ, మున్సిపల్ చట్టాల సవరణ వంటి 6 ఆర్డినెన్సుల స్థానంలో బిల్లులను ప్రవేశపెట్టే అవకాశముంది. సూపర్-6 మొదలు సాగునీటి ప్రాజెక్టుల వరకు 20 అంశాలపై చర్చించేందుకు TDP ప్రతిపాదించొచ్చు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకెళ్లాలని YCP నిర్ణయించుకున్నట్లు సమాచారం.