News April 16, 2025
పంచాయతీ ఉద్యోగులకు గుడ్ న్యూస్

TG: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో పని చేసే చిరు ఉద్యోగులకు మే నుంచి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి నెలనెలా జీతాలు అందనున్నాయి. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ఫైల్‌కు ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చింది. ప్రతినెలా వీరి జీతాల కోసం రూ.115కోట్లు కేటాయించనున్నారు. ఇకపై వారికి నెలనెలా వేతనాలు అందేలా ప్రత్యేక పోర్టర్ రూపొందించేందుకు కసరత్తు జరుగుతోంది. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా 92వేల మందికి ప్రయోజనం చేకూరనుంది.
Similar News
News April 17, 2025
గోల్డ్ మెడల్ సాధించిన నీరజ్ చోప్రా

సౌతాఫ్రికాలో జరిగిన ఇన్విటేషనల్ ఈవెంట్లో ఒలింపిక్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా సత్తా చాటారు. 84.52 మీటర్ల జావిలింగ్ త్రో విసిరి గోల్డ్ మెడల్ సాధించారు. మెుత్తంగా ఆరుగురు పోటీపడ్డ ఈ ఇన్విటేషనల్ ఈవెంట్లో విజేతగా నిలిచారు. వచ్చే నెలలో దోహా డైమండ్ లీగ్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో నీరజ్ చోప్రా తన సీజన్‌ను విజయంతో ప్రారంభించారు.
News April 17, 2025
ఆ 25వేల మంది టీచర్లకు సుప్రీంకోర్టు ఊరట

పశ్చిమ బెంగాల్లో ఉద్యోగాలు కోల్పోయిన 25వేల మంది టీచర్లకు సుప్రీంకోర్టు కాస్త ఉపశమనం కలిగించింది. నూతన నియామకాలు చేపట్టేవరకు వారు విధులు నిర్వహించవచ్చని తెలిపింది. విద్యార్థులు నష్టపోకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కాగా రిక్రూట్మెంట్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో 25వేల టీచర్ నియామకాలు చెల్లవని ఇటీవల అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చిన విషయం తెలిసిందే.
News April 17, 2025
అమానుషం.. బధిర బాలికపై సామూహిక అత్యాచారం?

UPలో 2 రోజుల క్రితం అదృశ్యమైన ఓ 11 ఏళ్ల మూగ-చెవిటి బాలిక అర్ధనగ్నంగా, అపస్మారకస్థితిలో కనిపించింది. ఆమె ముఖంపై గాయాలు, పంటిగాట్లు, మర్మాంగాలపై సిగరెట్‌తో కాల్చిన గుర్తులున్నట్లు వైద్యులు తెలిపారు. సామూహిక అత్యాచారం జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. పోలీసులు ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 3 బృందాలతో నిందితుల కోసం గాలిస్తున్నట్లు SP అతుల్ కుమార్ శ్రీవాస్తవ వెల్లడించారు.