News April 16, 2025

రామగిరి ఎస్ఐని దూషించిన వారిపై కేసు

image

శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులను సోషల్ మీడియాలో దూషించిన వారిపై కేసు నమోదైంది. ఈ నెల 13న సుధాకర్ చేసిన ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సైబర్ క్రైమ్ విభాగం పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు చేపట్టనున్నారు.

Similar News

News April 16, 2025

మైనారిటీలంటే ముస్లింలే కాదు: కిరణ్ రిజిజు

image

భారత్‌లో మైనారిటీలంటే కేవలం ముస్లింలే కాదని, 6మతాలకు చెందినవారిని అల్పసంఖ్యాక వర్గాలుగానే పరిగణిస్తారని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. మైనారిటీ శాఖ మంత్రి అయినందునే జాతీయ వక్ఫ్ కౌన్సిల్‌ ఛైర్మన్‌గా నియమించారన్నారు. కాగా ముస్లిమేతరులను వక్ఫ్ బోర్డులో నియమించడంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హిందూ బోర్డుల్లో ముస్లింలను నియమిస్తారా? అని ప్రశ్నించింది.

News April 16, 2025

సర్వేను పకడ్బందీగా చేపట్టాలి: ADB DEO

image

యూడైస్లో నమోదైన సంఖ్య మేరకు విద్యార్థులు, పాఠశాల భౌతిక, వసతులపై డైట్ ఛాత్రోపాధ్యాయులు చేస్తున్న థర్డ్ పార్టీ సర్వే పకడ్బందీగా చేపట్టాలని డీఈవో శ్రీనివాసరెడ్డి అన్నారు. బేల అశోక్‌నగర్ ప్రాథమిక పాఠశాలలో సర్వే తీరును ప్లానింగ్ కోఆర్డినేటర్ నారాయణతో కలిసి ఆయన పరిశీలించారు. పాఠశాల రిపోర్టు కార్డులో నమోదైన వివరాల ద్వారా భౌతిక పరిశీలన చేసి ధ్రువీకరించాలని సూచించారు. ఈనెల 21వరకు సర్వే కొనసాగుతుందన్నారు.

News April 16, 2025

రేపు తిరుపతికి రానున్న 16వ ఫైనాన్స్ కమిషన్ బృందం  

image

రెండు రోజుల జిల్లా పర్యటన నిమిత్తం గురువారం 16వ ఫైనాన్స్ కమిషన్ తిరుపతికి రానున్నట్లు తిరుపతి కలెక్టర్ డా.వెంకటేశ్వర్ పేర్కొన్నారు. ఈ మేరకు విధులు కేటాయించబడిన అధికారులు బాధ్యతగా చేపట్టాలన్నారు.16వ ఆర్థిక కమిషన్ ఛైర్మన్ డా.అరవింద్ పనగారియాతోపాటు 15 మంది సభ్యులతో కూడిన కమిషన్ ఉదయం విజయవాడ నుంచి బయలుదేరి 11 గంటలకు రేణిగుంటకు చేరుకుంటారని కలెక్టర్ చెప్పారు.

error: Content is protected !!