News April 16, 2025
పవన్ భార్యపై ట్రోల్స్.. విజయశాంతి ఫైర్!

శ్రీవారికి తలనీలాలు సమర్పించిన AP DyCM పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవాపై ట్రోలింగ్ చేయడం సరికాదని TG MLC విజయశాంతి మండిపడ్డారు. ‘విదేశాల నుంచి వచ్చి, పుట్టుకతో వేరే మతం అయినప్పటికీ హిందూ ధర్మాన్ని విశ్వసించిన అన్నా లెజినోవాపై కామెంట్స్, ట్రోలింగ్ చేయడం అత్యంత అసమంజసం. తన కుమారుడు అగ్ని ప్రమాదం నుంచి బయటపడినందుకు కృతజ్ఞతగా శ్రీవారికి తలనీలాలిచ్చారు. ఇలా ట్రోల్ చేయడం తప్పు’ అని ట్వీట్ చేశారు.
Similar News
News April 16, 2025
మైనారిటీలంటే ముస్లింలే కాదు: కిరణ్ రిజిజు

భారత్‌లో మైనారిటీలంటే కేవలం ముస్లింలే కాదని, 6మతాలకు చెందినవారిని అల్పసంఖ్యాక వర్గాలుగానే పరిగణిస్తారని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. మైనారిటీ శాఖ మంత్రి అయినందునే జాతీయ వక్ఫ్ కౌన్సిల్ ఛైర్మన్‌గా నియమించారన్నారు. కాగా ముస్లిమేతరులను వక్ఫ్ బోర్డులో నియమించడంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హిందూ బోర్డుల్లో ముస్లింలను నియమిస్తారా? అని ప్రశ్నించింది.
News April 16, 2025
ALL TIME RECORD: రూ.లక్షకు చేరువలో గోల్డ్ రేట్

ఢిల్లీలో బంగారం ధర రూ.లక్షకు చేరువైంది. ఇవాళ సాయంత్రం రూ.1650 పెరగడంతో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ ఆల్‌టైం హైకి చేరి రూ.98,100గా నమోదైంది. US, చైనా మధ్య వాణిజ్య యుద్ధం కారణంగా ఇన్వెస్టర్లు బంగారంపైకి భారీగా పెట్టుబడులు మళ్లిస్తున్నారు. దీంతో అంతర్జాతీయ ధరకు అనుగుణంగా దేశీయంగా గోల్డ్ రేట్స్‌కు రెక్కలొచ్చాయి. అతిత్వరలోనే ఇది రూ.లక్షను తాకనున్నట్లు మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
News April 16, 2025
15 ఏళ్ల తర్వాత మళ్లీ పాక్, బంగ్లా చర్చలు

పాక్, బంగ్లా మధ్య 15 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ చర్చలు ప్రారంభం కానున్నాయి. ఇరు దేశాల విదేశాంగ కార్యదర్శులు రేపు ఢాకాలో భేటీ కానున్నారు. వాణిజ్య, భద్రతాపరమైన అంశాలపై వారు చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. బంగ్లాకు తమ ఎగుమతుల్ని పెంచే ఆలోచనలో పాక్ ఉంది. అఫ్గాన్, ఇరాన్ నుంచి కూడా ఉత్పత్తుల్ని పాక్ ద్వారా బంగ్లాకు చేరవేయాలని ఆ దేశం భావిస్తున్నట్లు సమాచారం.