News April 16, 2025

కైలాసపట్నం: క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమం

image

కోటవురట్ల మండలం కైలాసపట్నం బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కేజీహెచ్ సీఎస్ఆర్ బ్లాక్‌లో చికిత్స పొందుతున్న జల్లూరి నాగరాజు, ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మడకల జానకిరామ్‌కు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. ఈ విషయాన్ని వారి బంధువులు మంగళవారం తెలిపారు. వి.సంతోషి, వి షారోని, వి.రాజును త్వరలో డిశ్చార్జ్ చేయనున్నారు.

Similar News

News February 1, 2026

విశాఖ: భూముల విలువ పెంపు తాత్కాలిక వాయిదా?

image

విశాఖలో భూ విలువల పెంపునకు తాత్కాలికంగా బ్రేక్ వేసినట్టు సమాచారం. ఫిబ్రవరి 1 నుంచి కొత్త భూ విలువలు అమలు చేయాలన్న ప్రతిపాదనలపై రిజిస్ట్రేషన్ శాఖ వారు ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించారు. వీటిని కమిటీ పరిశీలించి జేసీకు నివేదిక పంపింది. అయితే ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో ఆ ఫైల్ జేసీ వద్దే నిలిచిపోయినట్టు తెలుస్తోంది. దీంతో పెంపు వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

News February 1, 2026

కేజీహెచ్‌లో రాష్ట్రంలోనే తొలిగా ‘పెయిన్ క్లినిక్’ ప్రారంభం

image

విశాఖ కేజీహెచ్‌లో రాష్ట్రంలోనే మొదటి ‘పెయిన్ క్లినిక్’ను ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు. AMCANA సంస్థ రూ. కోటి విరాళంతో దీనిని ఏర్పాటు చేసింది. దీర్ఘకాలిక, క్యాన్సర్ నొప్పులతో బాధపడే రోగులకు ఈ క్లినిక్ ఎంతో ఉపయోగపడుతుందని మంత్రి తెలిపారు. దాతల సహకారంతో ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేసి, పేదలకు నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

News February 1, 2026

విశాఖ: ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభం

image

ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ఆదివారం నుంచి జిల్లాలో ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలు రెండు విడతల్లో ఫిబ్రవరి 10 వరకు కొనసాగనున్నాయి. జిల్లావ్యాప్తంగా 35,404 మంది విద్యార్థులు ప్రాక్టికల్స్‌కు హాజరవుతున్నట్లు ఆర్జేడీ మురళీదర్ తెలిపారు. ఎంపీసీ విద్యార్థులు 30,433 కాగా, బైపీసీ వారు 4,971 మంది ఉన్నారు. పరీక్షల నిర్వహణ కోసం ఇంటర్ బోర్డు అధికారులు జిల్లాలో 159 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.