News April 16, 2025
వరంగల్: చాక్లెట్ కోసం వెళ్లి అనంత లోకాలకు..

చెన్నారావుపేట మం. పుల్లయ్యబోడు తండాలో మంగళవారం <<16107593>>టిప్పర్ ఢీకొని<<>> రెండో తరగతి విద్యార్థి మృతి చెందిన విషయం తెలిసిందే. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. తండాకు చెందిన వెంకన్న-జ్యోతికి కూతురు, కొడుకు. స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన కొడుకు అనిల్(8) చాక్లెట్ కొనుక్కోవడానికి షాప్‌కు వెళ్లాడు. నెక్కొండ నుంచి వస్తున్న టిప్పర్ డ్రైవర్ మద్యం మత్తులో ఢీకొట్టడంతో అనిల్ అక్కడికక్కడే మృతి చెందాడు.
Similar News
News April 16, 2025
మైనారిటీలంటే ముస్లింలే కాదు: కిరణ్ రిజిజు

భారత్‌లో మైనారిటీలంటే కేవలం ముస్లింలే కాదని, 6మతాలకు చెందినవారిని అల్పసంఖ్యాక వర్గాలుగానే పరిగణిస్తారని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. మైనారిటీ శాఖ మంత్రి అయినందునే జాతీయ వక్ఫ్ కౌన్సిల్ ఛైర్మన్‌గా నియమించారన్నారు. కాగా ముస్లిమేతరులను వక్ఫ్ బోర్డులో నియమించడంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హిందూ బోర్డుల్లో ముస్లింలను నియమిస్తారా? అని ప్రశ్నించింది.
News April 16, 2025
సర్వేను పకడ్బందీగా చేపట్టాలి: ADB DEO

యూడైస్లో నమోదైన సంఖ్య మేరకు విద్యార్థులు, పాఠశాల భౌతిక, వసతులపై డైట్ ఛాత్రోపాధ్యాయులు చేస్తున్న థర్డ్ పార్టీ సర్వే పకడ్బందీగా చేపట్టాలని డీఈవో శ్రీనివాసరెడ్డి అన్నారు. బేల అశోక్‌నగర్ ప్రాథమిక పాఠశాలలో సర్వే తీరును ప్లానింగ్ కోఆర్డినేటర్ నారాయణతో కలిసి ఆయన పరిశీలించారు. పాఠశాల రిపోర్టు కార్డులో నమోదైన వివరాల ద్వారా భౌతిక పరిశీలన చేసి ధ్రువీకరించాలని సూచించారు. ఈనెల 21వరకు సర్వే కొనసాగుతుందన్నారు.
News April 16, 2025
రేపు తిరుపతికి రానున్న 16వ ఫైనాన్స్ కమిషన్ బృందం

రెండు రోజుల జిల్లా పర్యటన నిమిత్తం గురువారం 16వ ఫైనాన్స్ కమిషన్ తిరుపతికి రానున్నట్లు తిరుపతి కలెక్టర్ డా.వెంకటేశ్వర్ పేర్కొన్నారు. ఈ మేరకు విధులు కేటాయించబడిన అధికారులు బాధ్యతగా చేపట్టాలన్నారు.16వ ఆర్థిక కమిషన్ ఛైర్మన్ డా.అరవింద్ పనగారియాతోపాటు 15 మంది సభ్యులతో కూడిన కమిషన్ ఉదయం విజయవాడ నుంచి బయలుదేరి 11 గంటలకు రేణిగుంటకు చేరుకుంటారని కలెక్టర్ చెప్పారు.