News April 16, 2025

తెలంగాణలో చనిపోయిన ముగ్గురు జిల్లా వాసులు వీరే..

image

తెలంగాణలో జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం రాఘవాపూర్ శివారు జాతీయ రహదారి వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అమలాపురం (M) సవరప్పాలేనికి చెందిన ఒకే కుటుంబసభ్యులు ముగ్గురు మృతి చెందారు. సత్తి శ్రీను, భార్య రమణకుమారి, కుమార్తె అనూష చనిపోయారు. వీరి మృతదేహాలకు జనగామ ఆసుపత్రిలో పోస్టుమార్టం చేసి బుధవారం సొంత గ్రామానికి తీసుకురానున్నట్లు బంధువులు తెలిపారు. వారి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Similar News

News January 17, 2026

VZM: వాట్సాప్‌లో పోలీస్ సేవలు.. నంబర్ ఇదే!

image

విజయనగరం జిల్లాలో ప్రజలు ఇకపై పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండానే వాట్సాప్ ద్వారా సేవలు పొందవచ్చని SP దామోదర్ శనివారం తెలిపారు. ‘మనమిత్ర’ విధానం ద్వారా FIR కాపీలు, ఈ-చలాన్ స్థితిని ఇంటి నుంచే తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. ఇందుకోసం 9552300009 నంబర్‌కు “Hi” అని మెసేజ్ పంపాలని సూచించారు. ఆధునిక సాంకేతికతతో త్వరితగతిన సేవలు అందించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు.

News January 17, 2026

NGKL: 15 మంది ల్యాబ్ టెక్నీషియన్‌ల నియామకం

image

నాగర్ కర్నూల్ జిల్లాలో 15 మంది నూతన ల్యాబ్ టెక్నీషియన్‌లకు విధుల నియామక ఉత్తర్వులు జారీ అయ్యాయి. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.కే.రవికుమార్ శనివారం వివిధ PHCలలో విధులు చేపట్టేందుకు ఉత్తర్వులు అందజేశారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో ల్యాబ్ టెక్నీషియన్‌ల కొరత తీరడంతో మూత్ర, రక్త పరీక్షలు మెరుగవుతాయని తెలిపారు. ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించేందుకు నూతన ఉద్యోగులు కృషి చేయాలని ఆయన సూచించారు.

News January 17, 2026

మేడారం మహాజాతర.. ప్రధాన ఘట్టాలు!

image

TG: మేడారం మహాజాతర మరో 11 రోజుల్లో ప్రారంభం కానుంది. ముఖ్య కార్యక్రమాల వివరాలు ఇలా..
* ఈ నెల 28(బుధవారం) సాయంత్రం 4 గంటలకు సారలమ్మ గద్దెకు వచ్చే సమయం
* 29(గురువారం) సాయంత్రం 5 గంటలకు సమ్మక్క గద్దెకు వచ్చే సమయం
* 30(శుక్రవారం) అమ్మవార్లకు మొక్కులు చెల్లించుట
* 31(శనివారం) సాయంత్రం 4 గంటలకు సమ్మక్క-సారలమ్మ వనప్రవేశం
** ఈ నెల 19న సీఎం రేవంత్ గద్దెల పునరుద్ధరణ ప్రారంభోత్సవం చేస్తారు.