News April 16, 2025

KMM: కోచ్ నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

image

ఖమ్మం జిల్లా లోని మధిర, వైరా, కల్లూరు మినీ స్టేడియాల్లో క్రీడా కారులకు శిక్షణ ఇచ్చేందుకు గాను కోచ్‌ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువ జన, క్రీడల శాఖ అధికారి సునిల్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల ఎన్ఐఎస్ శిక్షణ పొంది సర్టిఫికెట్ ఉన్న వారు, సీనియర్ క్రీడాకారులు ఈనెల 22 కల్లా తమ దరఖాస్తులను సర్దార్ పటేల్ స్టేడియంలోని కార్యాలయంలో అందజేయాలని కోరారు.

Similar News

News January 19, 2026

అడవిలో హైటెక్ పద్ధతిలో వన్యప్రాణుల గణన

image

ఖమ్మం జిల్లాలోని 60,300 హెక్టార్ల అటవీ విస్తీర్ణంలో వన్యప్రాణుల గణన ప్రక్రియ ప్రారంభమైంది. డీఎఫ్‌ఓ సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ పర్యవేక్షణలో 85 బీట్లలో అధికారులు, వలంటీర్లు 5 రోజుల పాటు కాలినడకన సర్వే చేయనున్నారు. ఈసారి పులులు, చిరుతల ఆనవాళ్లను గుర్తించేందుకు థర్మల్ డ్రోన్లు, ప్రత్యేక మొబైల్ యాప్, జియో ట్యాగింగ్‌ వంటి అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు.

News January 19, 2026

ఖమ్మం జిల్లాలో 27 గ్రామాల్లో ‘సౌర’ వెలుగులు!

image

ఖమ్మం జిల్లాలో విద్యుత్ స్వయం సమృద్ధి లక్ష్యంగా 27 గ్రామాలను ‘మోడల్ సోలార్ విలేజ్’లుగా మార్చేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. బోనకల్, నేలకొండపల్లి, ఎన్కూరు, రఘునాథపాలెం, వైరా మండలాల్లో 16,837 ఇళ్లకు, 4,371పంపుసెట్లకు రెడ్-కో ద్వారా ఉచిత సౌర విద్యుత్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేడు రావినూతలలో ఈ బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

News January 19, 2026

ఖమ్మం: ఉదారతను చాటుకున్న డీఈఓ

image

పదో తరగతి విద్యార్థులపై డీఈఓ చైతన్య జైనీ తన ఉదారతను చాటుకున్నారు. నేలకొండపల్లి మండలంలోని ప్రత్యేక తరగతులకు హాజరయ్యే 13 పాఠశాలల విద్యార్థులకు తన సొంత ఖర్చుతో స్నాక్స్ అందించాలని నిర్ణయించారు. సుమారు 250 మంది విద్యార్థులకు నేటి నుంచి ఫిబ్రవరి 15 వరకు ప్రతిరోజూ సాయంత్రం రూ.20 విలువైన అల్పాహారం పంపిణీ చేయనున్నారు.