News April 16, 2025
కాళ్ల: గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో టీచర్

కాళ్ల మండలం సీసలి హైస్కూల్లో ఇంగ్లీష్ టీచర్‌గా పని చేస్తున్న చెల్లుబోయిన పద్మ సంగీత వాయిద్య ప్రదర్శనల్లో అత్యంత ప్రతిభ కనబర్చి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో స్థానం సంపాదించారు. కీబోర్డ్ ఉపయోగించి సంగీతంలో మంచి ప్రతిభ కనబర్చిన పద్మకు హైదరాబాద్ హలెల్ మ్యూజిక్ స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో గిన్నిస్ రికార్డు పత్రాన్ని అందించారు.
Similar News
News April 16, 2025
ప.గో: సమ్మర్ సెలవుల్లో ఈప్రాంతాలు చూసొద్దాం రండి..

వేసవి సెలవులకు టూర్ ప్లాన్ చేసుకునే వారికి ప.గోజిల్లా స్వాగతం పలుకుతోంది. ఆధ్యాత్మిక క్షేత్రాలు, సముద్ర తీరాలు మనసులను కట్టిపడేస్తాయి. భీమవరం మావుళ్లమ్మ, పెనుగొండ వాసవీ ధాం, పాలకొల్లు క్షీరా రామలింగేశ్వర స్వామి క్షేత్రం, నత్తా రామేశ్వరం, దువ్వ దానేశ్వరీ అమ్మవారు, కాళ్ల సీసలి సాయిబాబా మందిరం, పేరుపాలెం బీచ్ సందర్శించి ఆహ్లాదాన్ని పొందవచ్చు. మీరేమైనా టూర్ ప్లాన్ చేసుకున్నారా కామెంట్ చేయండి.
News April 16, 2025
ఉమ్మడి ప.గో. జిల్లాలో 166 పోస్టులు

విద్యాశాఖ పాఠశాల ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు బోధించేందుకు కొత్తగా 105 SGT, SA కేడర్లలో ఉపాధ్యాయ పోస్టులను ఉమ్మడి ప.గో.జిల్లాకు మంజూరు చేసింది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాకు మంజూరైన 61 (SET) పోస్టులతో కలిపితే మొత్తం 166 పోస్టులయ్యాయి. ఉమ్మడి జిల్లాలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలు మొత్తం 2,671 మంది ఉండగా, యూడైస్ కోడ్ ఆధారంగా పోస్టులు ఆమోదిస్తారని అభ్యర్థులు భావిస్తున్నారు.
News April 16, 2025
ప.గో: సూర్యఘర్ పథకం అనుకున్నంతగా లేదు..కలెక్టర్

భీమవరం కలెక్టరేట్‌లో మంగళవారం సీఎం సూర్యఘర్ పథకం అమలుపై జిల్లాలోని విద్యుత్ శాఖ ఈఈలు, డిఇలు, ఏఈలతో గూగుల్ మీట్ ద్వారా కలెక్టర్ చదలవాడ నాగరాణి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని ఇప్పటివరకు14,392 దరఖాస్తులు రిజిస్ట్రేషన్ చేయగా, 917 గృహాలకు మాత్రమే సోలార్ విద్యుత్తును ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. జిల్లాలో ఈ పథకం అమలు అనుకున్నంత వేగంగా జరగటంలేదని అసహనం వ్యక్తం చేశారు.