News April 16, 2025
జపాన్ పర్యటనకు CM రేవంత్

TG: CM రేవంత్ జపాన్ పర్యటనకు వెళ్లారు. నేటి నుంచి ఈనెల 22 వరకు తన బృందంతో కలిసి టోక్యో, మౌంట్ ఫుజి, ఒసాకా, హిరోషిమాలో పర్యటిస్తారు. ఈనెల 21న ఒసాకా వరల్డ్ ఎక్స్ పోలో తెలంగాణ పెవిలియన్‌ను ప్రారంభిస్తారు. ప్రముఖ కంపెనీలు, పారిశ్రామిక వేత్తలు, పలువురు ప్రతినిధులతో సమావేశమవుతారు. రాష్ట్రంలో పెట్టుబడులు, పారిశ్రామిక సాంకేతిక సహకారంపై ప్రధానంగా చర్చలు జరపనున్నారు. 23న తిరిగి HYD చేరుకుంటారు.
Similar News
News January 15, 2026
ట్రంప్ ఆదేశిస్తే ఇరాన్‌పై దాడి ఖాయం!

ఇరాన్‌పై దాడి చేసే పలు మార్గాలను అమెరికా పరిశీలిస్తున్నట్లు అంతర్జాతీయంగా ఊహాగానాలు ఊపందుకున్నాయి. US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశిస్తే ఏ క్షణమైనా దాడి జరగొచ్చని తెలుస్తోంది. ఇందులో ముఖ్యంగా అమెరికా సైనిక స్థావరాల నుంచి వైమానిక దాడులు, సముద్ర మార్గం ద్వారా క్షిపణి దాడులు, డ్రోన్ దాడులు, సైబర్ వార్, సీక్రెట్ ఆపరేషన్ లేదా కీలక మౌలిక సదుపాయాలపై దాడులు వంటి ఆప్షన్లు ఉన్నట్లు సమాచారం.
News January 15, 2026
హైదరాబాద్ కెప్టెన్‌గా మహ్మద్ సిరాజ్

రంజీ ట్రోఫీ 2025-26 సీజన్ సెకండ్ ఫేజ్ మ్యాచ్‌లకు హైదరాబాద్ కెప్టెన్‌గా టీమ్ ఇండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ వ్యవహరించనున్నారు. ఈ మేరకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ 15 మందితో కూడిన టీమ్‌ను ప్రకటించింది. జనవరి 22న ముంబై, 29న ఛత్తీస్‌గఢ్‌తో జరిగే మ్యాచ్‌లలో సిరాజ్ జట్టును నడిపించనున్నారు. రాహుల్ సింగ్‌ను VCగా ఎంపిక చేశారు. VHTలో డబుల్ సెంచరీతో చెలరేగిన అమన్‌రావ్ పేరాల సైతం జట్టులో ఉన్నారు.
News January 15, 2026
పండక్కి అల్లుళ్లను ఇంటికి ఎందుకు పిలుస్తారు?

అల్లుడిని విష్ణు స్వరూపంగా భావిస్తారు. ఉత్తరాయణ పుణ్య కాలంలో ఆయనకు చేసే మర్యాదలు ఆ నారాయణుడికే చెందుతాయని, దీనివల్ల పితృదేవతలు శాంతించి వంశాభివృద్ధి కలుగుతుందని నమ్ముతారు. అలాగే, పంట చేతికొచ్చే సమయంలో కూతురు, అల్లుడిని పిలిచి విందులు, వస్త్రదానాలతో సత్కరించడం ద్వారా 2 కుటుంబాల మధ్య బంధం బలపడుతుంది. అందుకే కొత్త అల్లుడు సంక్రాంతికి అత్తవారింటికి రావడం మన సంస్కృతిలో మధురమైన సంప్రదాయంగా మారింది.


