News April 16, 2025

ఎమ్మిగనూరు విద్యార్థినికి లోకేశ్ సన్మానం

image

ప్రభుత్వ కాలేజీలో చదివి ఇంటర్‌లో 987 మార్కులు సాధించిన యువతి ధృతికాబాయిని మంత్రి నారా లోకేశ్ సన్మానించారు. ల్యాప్ టాప్, గోల్డ్ మెడల్ అందజేసి అభినందించారు. ధృతికాబాయి ఎమ్మిగనూరులోని బనవాసి గురుకుల జూనియర్ కళాశాలలో చదివారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో టాపర్‌లుగా నిలిచిన విద్యార్థులు ప్రభుత్వ విద్య పరువును కాపాడారని మంత్రి అన్నారు.

Similar News

News September 16, 2025

రేబిస్‌తో చిన్నారి మృతి

image

AP: గుంటూరు(D) పొన్నూరు (M) వెల్లటూరులో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన తాడిశెట్టి కార్తీక్(5) ఇంటి వద్ద ఆడుకుంటుండగా గత నెల 22న కుక్కలు దాడి చేశాయి. గాయపడిన బాలుడిని పలు ఆస్పత్రుల్లో చూపించారు. 3రోజుల కిందట ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో విజయవాడలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లగా రేబిస్ సోకినట్లు వైద్యులు గుర్తించారు. చికిత్స కోసం GNT ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా ఆరోగ్య పరిస్థితి విషమించి చనిపోయాడు.

News September 16, 2025

‘పాలమూరు-రంగారెడ్డి పూర్తికి ప్రభుత్వం పై ఒత్తిడి చేద్దాం’

image

పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేసే విషయమై ప్రభుత్వంపై ఒత్తిడి చేద్దామని మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. సోమవారం రాత్రి MBNRలో బీఆర్ఎస్ నేతల సమావేశం నిర్వహించారు. మిగిలిన 15 శాతం పూర్తి చేసేందకు ప్రభుత్వంపై ఒత్తిడి చేద్దామన్నారు. నడిగడ్డ నేతలు ALP ఎమ్మెల్యే విజయుడు, బాసు హనుమంతు నాయుడు, బీఎస్ కేశవ్ పాల్గొన్నారు.

News September 16, 2025

నాగార్జున యూనివర్సిటీ విద్యార్థులకు ముఖ్య గమనిక

image

నాగార్జున విశ్వవిద్యాలయం పీజీ రెండో సెమిస్టర్ పరీక్షల ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. MSC స్టాటిస్టిక్స్‌లో 45 మందికి గాను.. 44 మంది మంది ఉత్తీర్ణులయ్యారు. బయోకెమిస్ట్రీలో 24 మందిలో 17 మంది ఉత్తీర్ణులయ్యారని అధికారులు తెలిపారు. ఫలితాలపై అభ్యంతరాలున్నవారు ఈ నెల 24లోగా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు సూచించారు. రీవాల్యూయేషన్‌ కోసం రూ.1860, వ్యక్తిగత పేపర్‌ వెరిఫికేషన్‌ కోసం రూ.2190 చెల్లించాలన్నారు.