News April 16, 2025
నెల్లూరులో ఇద్దరు ఆత్మహత్య

పెళ్లి జరిగి ఏడాది తిరగక ముందే నెల్లూరులో ఇద్దరు సూసైడ్ చేసుకున్నారు. ముదివర్తిపాలేనికి చెందిన స్మైలీ(23), నాగూర్ బాబు(ఇందుకూరుపేట) 7నెలల కిందట ప్రేమ పెళ్లి చేసుకున్నారు. మూడో మైలులో నివాసం ఉంటుున్నారు. కులం పేరుతో నాగూర్ ఫ్యామిలీ వేధించడంతో స్మైలీ ఉరేసుకుంది. మూలాపేట పోలీస్ క్వార్టర్స్‌లో ఉండే ARకానిస్టేబుల్ నాగరాజు 9నెలల కిందట పూర్ణిమను రెండో పెళ్లి చేసుకోగా, కుటుంబ కలహాలతో పూర్ణిమ ఉరేసుకుంది.
Similar News
News January 17, 2026
నెల్లూరు: తీరం దాటిన సరదా.. అన్నాచెల్లెలు మృతి

కనుమ సంబరం కాస్తా కన్నీటి సంద్రమైంది. పండగ పూట కొత్త బట్టలు వేసుకుని, బంధువుల ఇళ్లలో సందడి చేయాల్సిన ఆ పసి ప్రాణాలు సముద్రపు అలల ఉధృతికి బలయ్యాయి. నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇసుకపల్లి తీరంలో జరిగిన ఈ విషాదం కేవలం ఒక ప్రమాదం మాత్రమే కాదు, మనందరికీ ఒక హెచ్చరిక. ఒకే ఇంట్లో ఇద్దరు బిడ్డలు (అమ్ములు, బాలకృష్ణ) ప్రాణాలు కోల్పోవడం ఆ తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది.
News January 17, 2026
జిల్లాలోనే మాజీ ఉపరాష్ట్రపతి

మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పండుగ సందర్భంగా జిల్లాలోని ఆయన స్వస్థలం వెంకటాచలం మండలంలోనే ఉన్నారు. కుటుంబ సభ్యులతో సరదాగా గడిపారు. ఆయనను పలువురు ప్రముఖులు మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయనను శుక్రవారం సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారిరువురు జిల్లా పరిస్థితుల గురించి మాట్లాడుకున్నారు.