News April 16, 2025
జగ్గయ్యపేట: ప్రేమించాను.. పెళ్లి చేసుకోవాలని యవతికి వేధింపులు

జగ్గయ్యపేటలో ప్రేమిస్తున్నానని, పెళ్లిచేసుకోవాలని వెంటపడి వేధించడంతో పాటు దౌర్జన్యానికి పాల్పడిన ఓ యువకుడిపై ఎస్ఐ రాజు మంగళవారం కేసు నమోదు చేశారు. కోదాడ రోడ్డుకు చెందిన యువతి(22) అదే ప్రాంతానికి చెందిన శివ కుమార్ (25) ప్రేమించానని, పెళ్లి చేసుకోవాలని వెంటపడి వేధించడంతో పాటు యువతి, ఆమె తల్లిపై దౌర్జన్యానికి పాల్పడ్డాడు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ వెల్లడించారు.
Similar News
News December 30, 2025
GNT: ఉల్లాస్ అక్షర ఆంధ్రపై వీసీ నిర్వహించిన కలెక్టర్

జిల్లాలోని నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు నిర్వహిస్తున్న ఉల్లాస్ అక్షర ఆంధ్ర కార్యక్రమంను నిర్దేశిత లక్ష్యాలకు మేరకు సక్రమంగా నిర్వహించాలని కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా సూచించారు. కలెక్టరేట్‌లో మంగళవారం ఆమె ఉల్లాస్ అక్షర ఆంధ్రపై వీసీ చేపట్టారు. మండల ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, సీఎంఎంలు, ఎంపీడీవోలు, ఏపీఎంలు, ఏపీఓలు పాల్గొన్నారు.
News December 30, 2025
తిరుపతి మధ్యలో బస్టాండ్ ఎందుకు…?

తిరుపతి బస్టాండ్‌ను రీమోడల్ చేయనున్నారు. ఇది సిటీ మధ్యలో ఉండటంతో ట్రాఫిక్ సమస్యలు పెరుగుతున్నాయి. భక్తులు, వైద్యం, విద్య, వాణిజ్య అవసరాల కోసం వచ్చే వారితో రద్దీ పెరుగుతోంది. గ్రేటర్ తిరుపతిని దృష్టిలో పెట్టుకుని లోకల్, తిరుమల బస్సులనే ప్రస్తుత బస్టాండ్ నుంచి నడపాలని ప్రజలు కోరుతున్నారు. సుదూర బస్సుల కోసం అవిలాల, అగ్రహారం, తిరుచానూరులో బస్టాండులు నిర్మించాలనే డిమాండ్ వినిపిస్తోంది.
News December 30, 2025
BREAKING.. పాలమూరు: బండరాయితో దాడి చేసి తల్లిని చంపిన కొడుకు

మహబూబ్‌నగర్ జిల్లాలో దారుణం జరిగింది. కన్నతల్లి డబ్బులు ఇవ్వలేదని కొడుకు బండరాయితో కొట్టి చంపిన ఘటన మంగళవారం బాలానగర్ మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఉడిత్యాల గ్రామానికి చెందిన హనుమమ్మ(75)ను తన కొడుకు ఆంజనేయులు మద్యానికి డబ్బులు ఇవ్వాలని కోరాడు. దీనికి తల్లి నిరాకరించటంతో ఆంజనేయులు కోపోద్రిక్తుడై బండరాయితో మోది చంపాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.


