News April 16, 2025

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

image

జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి మంగళవారం రూ.1,87,853 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.1,25,162, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.51,310, అన్నదానానికి రూ.11,381 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ పేర్కొన్నారు.

Similar News

News January 18, 2026

WC మ్యాచెస్‌పై ICCకి బంగ్లా మరో రిక్వెస్ట్

image

T20WC మ్యాచెస్ కోసం భారత్ వెళ్లేదిలేదని బంగ్లాదేశ్ ICCకి తేల్చి చెప్పింది. పలు చర్చల తర్వాత కూడా తమ మ్యాచులను శ్రీలంకకు మార్చాల్సిందే అంటోంది. దీనిపై వచ్చే వారం ICC తుది నిర్ణయం తీసుకోనుంది. అయితే ICCకి BCB కొత్త రిక్వెస్ట్ పెట్టింది. ఐర్లాండ్‌తో గ్రూపులు స్వాప్ చేసుకుంటామని చెప్పింది. ఐర్లాండ్ గ్రూప్ Bకి వస్తే, BAN గ్రూప్ Cకి వెళ్తుంది. అప్పుడు గ్రూప్ మ్యాచులు కొలంబో, పల్లెకెలెలో ఆడే వీలుంటుంది.

News January 18, 2026

సప్త సాగర యాత్ర గురించి మీకు తెలుసా?

image

చొల్లంగి అమావాస్య నాడు చొల్లంగి వద్ద సాగర సంగమ స్నానంతో సప్త సాగర యాత్ర ప్రారంభమవుతుంది. గోదావరి 7 పాయలు సముద్రంలో కలిసే 7 పుణ్య క్షేత్రాలను (చొల్లంగి, కోరంగి, తీర్థాలమొండి, నత్తల నడక, కుండలేశ్వరం, మందపల్లి/రైవా, అంతర్వేది) సందర్శించి భక్తులు స్నానాలు ఆచరిస్తారు. మాఘ శుక్ల ఏకాదశి నాడు అంతర్వేది వద్ద వశిష్ఠ నదిలో స్నానంతో ఈ యాత్ర ముగుస్తుంది. ఈ యాత్ర చేయడం వల్ల అనంతమైన పుణ్యఫలం లభిస్తుందని నమ్మకం.

News January 18, 2026

విభజన బ్లూప్రింట్: పోలీస్ కమిషనరేట్లే ప్రామాణికం?

image

మెగా బల్దియాను 3 కార్పొరేషన్లుగా (హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్‌గిరి) విభజించే ప్రతిపాదనపై ప్రభుత్వం రహస్యంగా కసరత్తు చేస్తోంది. ఇటీవల జరిగిన పోలీస్ కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణనే దీనికి ప్రామాణికంగా తీసుకోనున్నారు. పోలీస్ సరిహద్దుల ప్రకారమే కొత్త కార్పొరేషన్ల పరిధి ఉంటే పాలనాపరమైన ఇబ్బందులు తక్కువగా ఉంటాయని భావిస్తున్నారు. <<18882495>>300 డివిజన్ల<<>> డేటా అందుబాటులో ఉండటంతో రిజర్వేషన్ల ప్రక్రియకు ఆటంకం కలగదు.