News April 16, 2025
MHBD: రేషన్ షాపుల్లో ప్లాస్టిక్ రైస్ అనే ప్రచారం.. పౌర సరఫరాల శాఖ క్లారిటీ

రేషన్ షాపుల్లో ప్లాస్టిక్ రైస్ అనే ప్రచారం అబద్ధమని మహబూబాబాద్ జిల్లా పౌర సరఫరాలశాఖ అధికారి ప్రేమ్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రేషన్ షాపుల్లో పంపిణీచేసే సన్న బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం అంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని, ప్రజలు ఈ పుకార్లు నమ్మవద్దన్నారు. ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డుదారులందరికీ నాణ్యమైన సన్నబియ్యం పంపిణీ చేస్తుందన్నారు.
Similar News
News November 4, 2025
పర్వతగిరి: విద్యార్థినిని పాఠశాల నుంచి పంపించలేదు..!

<<18190237>>’ఈ విద్యార్థిని మాకొద్దని వెళ్లగొట్టారు’ <<>>అనే శీర్షికతో ఇవాళ Way2Newsలో వచ్చిన కథనానికి పర్వతగిరి ఎస్సీ గురుకుల ప్రిన్సిపల్ అపర్ణ స్పందించారు. తాము విద్యార్థినిని బలవంతంగా పంపించలేదని వివరించారు. విద్యార్థినికి హాస్టల్లో ఉండడం ఇష్టం లేకపోవడంతో తనతో పాటు తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించి వారి వెంట పంపించామన్నారు. విద్యార్థిని ఇష్టంగా వస్తే మళ్లీ పాఠశాలలో చేర్చుకుంటామని తెలిపారు.
News November 4, 2025
FLASH: నిర్మల్: యాక్సిడెంట్లో డ్రైవర్ మృతి

నిర్మల్ జిల్లా నర్సాపూర్ (జి) మండలం రాంపూర్ గ్రామ 61 <<18197838>>జాతీయ రహదారిపై మంగళవారం <<>>మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మామడ మండలం కోరటికల్ గ్రామానికి చెందిన డ్రైవర్ రాజేశ్వర్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సాయంత్రం మృతిచెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది.
News November 4, 2025
తిరుపతిలో ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య

తిరుపతి రేణిగుంట రోడ్డులోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం నెల్లూరు స్టోన్ హౌస్ పేటకు చెందిన విద్యార్థి సాయి చందు(20) హాస్టల్ టెర్రస్‌లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఫీజు కోసం తండ్రికి ఫోన్ చేసిన కొన్ని గంటల్లోనే మృతి చెందాడు. ప్రేమ వ్యవహారం మృతికి కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.


