News March 27, 2024
గుమ్మడిదల: మహిళ హత్య.. దొంగ స్వామీజీ అరెస్టు

పూజలు చేస్తామని నమ్మించి మహిళను హత్య చేసిన దొంగ స్వామీజీని అరెస్టు చేసినట్లు జిన్నారం సీఐ సుధీర్ కుమార్ తెలిపారు. గుమ్మడిదల పోలీస్ స్టేషన్లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బొంతపల్లికి చెందిన బుచ్చమ్మ(60)ను పూజలు చేసే మంచి జరుగుతుందని దొంగ స్వామీజీ శివ నమ్మించాడు. ఫిబ్రవరి 13న హత్య చేసి 4.3 తులాల బంగారం దొంగిలించాడు. పోలీసులు విచారణ చేసి నిందితుడిని అరెస్టు చేశారు.
Similar News
News September 7, 2025
మెదక్: ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జనం: ఎస్పీ

మెదక్ జిల్లా వ్యాప్తంగా వినాయక నిమజ్జనోత్సవం ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ముగిశాయని ఎస్పీ డీవీ.శ్రీనివాస రావు తెలిపారు. 11 రోజుల పాటు జిల్లా అంతటా పోలీస్ అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో 24 గంటలు అప్రమత్తంగా పనిచేయడంతో అన్ని మండలాలు, గ్రామాలు, పట్టణాల్లో వినాయక ఉత్సవాలు సజావుగా జరిగాయని పేర్కొన్నారు. ఈ సందర్బంగా సిబ్బందిని అభినందించారు.
News September 7, 2025
మెదక్: రేపు పోలింగ్ కేంద్రాలు, ఓటర్ జాబితాపై సమావేశం

మెదక్ జిల్లాలో పోలింగ్ కేంద్రాలు, ఓటర్ జాబితా ప్రచురణ, సంబంధించిన అంశాలపై సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సమీకృత కలెక్టరేట్‌లో కలెక్టర్ అధ్యక్షతన వివిధ రాజకీయ పార్టీ నాయకులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసినట్లు జడ్పీ సీఈఓ ఎల్లయ్య తెలిపారు. వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులందరూ ఈ సమావేశానికి సకాలంలో తప్పక హాజరుకావాలని సూచించారు.
News September 7, 2025
మెదక్: త్వరితగతిన పనులు పూర్తి చేయాలి: కలెక్టర్

మెదక్ పట్టణంలో ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణ పనులను కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. రూ.5 కోట్ల వ్యయంతో ఇందిర మహిళా శక్తి భవనాన్ని నిర్మించుకుంటున్నామని, పనులు వివిధ దశలలో కొనసాగుతున్నాయని తెలిపారు. భవన నిర్మాణం త్వరితగతిన పూర్తయ్యేలా పనులలో వేగం పెంచాలని పంచాయతీరాజ్ ఇంజినీర్‌ను ఆదేశించినట్లు తెలిపారు.