News April 16, 2025

పబ్‌లో HYD అమ్మాయిలతోనూ డాన్సులు

image

HYD చైతన్యపురిలోని పబ్‌లో యువతులతో <<16103579>>అర్ధనగ్న<<>> డాన్సులు చేయిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డ విషయం తెలిసిందే. కాగా.. ఇందులో ముంబై యువతులే కాకుండా HYDలోని వనస్థలిపురం, ఉప్పల్, సికింద్రాబాద్ అమ్మాయిలతోనూ డాన్సులు చేయిస్తున్నట్లు గుర్తించారు. యువకులను ఆకర్షించేందుకు పబ్‌లోకి ఫ్రీగా పంపించి, వారికి కంపెనీ ఇస్తూ అధికమొత్తంలో ఖర్చు చేయించి ఆ బిల్ కూడా వారితో కట్టిస్తున్నట్లు అధికారులు తేల్చారు.

Similar News

News November 7, 2025

అనకాపల్లి రైలు ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్..!

image

దక్షిణ రైల్వే ప్రకటించిన పండగ ప్రత్యేక రైళ్లకు అదనపు హాల్ట్‌లు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. భువనేశ్వర్ – బెంగళూరు కంటోన్మెంట్ ప్రత్యేక రైళ్లకు అనకాపల్లితో పాటు గుంటూరు, నరసరావుపేట, మార్కాపూర్ రోడ్ స్టాప్‌లు కల్పించారు. అరకు – యలహంక, శ్రీకాకుళం రోడ్-బెంగళూరు కంటోన్మెంట్, సంబల్పూర్, కటక్ ప్రత్యేక రైళ్లకు కూడా అదనపు నిలుపుదల చేస్తూ గురువారం అధికారులు ప్రకటించారు.

News November 7, 2025

సంగారెడ్డి: ఈనెల 20 నుంచి బడి బయట పిల్లల సర్వే

image

జిల్లాలో ఈనెల 20 నుంచి 31 డిసెంబర్ వరకు బడి బయట పిల్లల సర్వే నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసిందని DEO వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. పాఠశాల పరిధిలోని గ్రామాల్లో, ఆవాస ప్రాంతాల్లో 6-14 సంవత్సరాలలోపు బడి బయట ఉన్న విద్యార్థులను గుర్తించి పాఠశాలలో చేర్పించాలని పేర్కొన్నారు. గుర్తించిన విద్యార్థుల వివరాలను ప్రబంధ పోర్టర్లో నమోదు చేయాలని సూచించారు.

News November 7, 2025

పెద్ది నుంచి లిరికల్ కాదు.. వీడియో సాంగ్

image

టాలీవుడ్ ప్రేక్షకులను డైరెక్టర్ బుచ్చిబాబు ‘చికిరి చికిరి’ అంటూ ఊరిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ సాంగ్ ప్రోమో కూడా రిలీజ్ అయ్యింది. ఫుల్ సాంగ్‌ను ఇవాళ ఉదయం 11.07కి విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే అందరూ అనుకున్నట్లు లిరికల్ సాంగ్‌ను కాకుండా వీడియో సాంగ్‌నే రిలీజ్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా పెద్ది చిత్రం నిర్మాణ సంస్థ వృద్ధి సినిమాస్ SMలో పేర్కొంది.