News March 27, 2024

అనపర్తి MLA అభ్యర్థిగా శివరామకృష్ణం రాజు

image

ఎట్టకేలకు అనపర్తి MLA టికెట్ బీజేపీ ఖాతాలోకి వెళ్లింది. బిక్కవోలు మండలం రంగాపురానికి చెందిన ఆ పార్టీ నేత ములగపాటి శివరామకృష్ణం రాజును ఎమ్మెల్యే అభ్యర్థిగా అధిష్ఠానం ప్రకటించింది. టీడీపీ తొలి జాబితాలో అనపర్తి అభ్యర్థిగా రామకృష్ణారెడ్డిని చంద్రబాబు ప్రకటించారు. తర్వాత బీజేపీ ఎంట్రీ ఇవ్వడంతో ఈ సీటుపై ఉత్కంఠ నెలకొంది. సోము వీర్రాజు పోటీ చేస్తారని ప్రచారం జరిగినా చివరకు రాజుకే టికెట్ దక్కింది.

Similar News

News February 20, 2026

జిల్లా రిజిస్ట్రార్‌గా జగన్మోహనరావు బాధ్యతల స్వీకారం

image

తూ.గో. జిల్లా నూతన రిజిస్ట్రార్‌గా కె.జగన్మోహనరావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. 1993లో జూనియర్ అసిస్టెంట్‌గా ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన, సీనియర్ అసిస్టెంట్‌గా, గ్రేడ్-2, గ్రేడ్-1 సబ్ రిజిస్ట్రార్‌గా వివిధ హోదాల్లో పనిచేశారు. మచిలీపట్నం సబ్ రిజిస్ట్రార్‌గా సేవలందిస్తూ పదోన్నతిపై ఇక్కడకు విచ్చేశారు. ఈ సందర్భంగా పలువురు సబ్ రిజిస్ట్రార్‌లు, సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

News February 19, 2026

గొల్లగూడెం: ట్రాక్టరుపై నుంచి పడి బాలిక స్పాట్ డెడ్

image

దేవరపల్లి మండలంలోని గొల్లగూడెం వద్ద గురువారం జరిగిన ప్రమాదంలో 11 ఏళ్ల బాలిక మృతి చెందింది. నిడదవోలు మండలం సమీశ్రగూడెంకు చెందిన ఓ కుటుంబం పొగాకు పనుల నిమిత్తం దుమంతులగూడెం వలస వచ్చింది. పనికి వెళ్తుండగా ట్రాక్టరుపై నుంచి బాలిక ప్రమాదవశాత్తు జారి కిందపడటంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. దేవరపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News February 19, 2026

కొవ్వూరు మున్సిపాలిటీపై పసుపు జెండా

image

తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మున్సిపల్ పీఠం TDP పరమైంది. YCP మున్సిపల్ ఛైర్‌పర్సన్ బావన రత్నకుమారితో పాటు నలుగురు కౌన్సిలర్లు పల్లా శ్రీనివాసరావు సమక్షంలో బుధవారం TDPలో చేరారు. దీంతో ఎమ్మెల్యేతో కలిపి కూటమి బలం 14కు చేరి స్పష్టమైన మెజారిటీ లభించింది. గత ఎన్నికల్లో YCP గెలిచినప్పటికీ, తాజా మార్పులతో కొవ్వూరు మున్సిపాలిటీని TDP కైవసం చేసుకుంది.