News April 16, 2025
AI టాలెంట్‌లో భారత్ టాప్: స్టాన్‌ఫోర్డ్ వర్సిటీ

గతేడాది ఏఐ నిపుణుల నియామకంలో భారత్ టాప్‌లో నిలిచినట్లు స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ ‘ఏఐ ఇండెక్స్ 2025‘ వెల్లడించింది. ఏఐ నియామకాల్లో ఇండియా 33 శాతం వృద్ధి సాధించినట్లు తెలిపింది. భారత్ తర్వాత బ్రెజిల్ (30.83), సౌదీ అరేబియా (28.71), అమెరికా (24.73) ఉన్నట్లు పేర్కొంది. కాగా ఏఐ టాలెంట్‌ను నిలుపుకోవడంలో భారత్ ఇబ్బందులు పడుతోందని, ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడంలో సవాళ్లు ఎదుర్కొంటోందని తెలిపింది.
Similar News
News October 26, 2025
జూబ్లీహిల్స్‌లో ‘కారు’ను పోలిన ఫ్రీ సింబల్స్

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో BRSకు ఫ్రీ సింబల్స్‌తో తిప్పలు తప్పేలా లేవు. ఇండిపెండెంట్లకు EC కెమెరా, చపాతీ రోలర్, రోడ్ రోలర్, సోప్ డిష్, టీవీ, షిప్ వంటి ఫ్రీ సింబల్స్ కేటాయించింది. ఇవి కారును పోలి ఉంటాయనే ఆందోళన ఆ పార్టీ నేతల్లో నెలకొంది. ఇలాంటి ఫ్రీ సింబల్స్ తొలగించాలని BRS ఇప్పటికే పలుమార్లు ఫిర్యాదు చేసింది. అయితే ఈసారి అభ్యర్థి ఫొటో కూడా ఉండనుండటంతో ఈ ‘సింబల్ కన్ఫ్యూజన్’ అంతగా ఉండకపోవచ్చు.
News October 26, 2025
ఇంటర్ విద్యార్థులకు అలర్ట్

AP: ఇంటర్ విద్యార్థులు తమ పేరు, గ్రూప్, మీడియం తదితర వివరాలను చెక్ చేసుకునేందుకు ఇంటర్ విద్యా మండలి అవకాశం కల్పించింది. <
News October 26, 2025
ఎర పంటల వల్ల వ్యవసాయంలో లాభమేంటి?

కొన్ని రకాల పంటలు కొన్ని పురుగులను విపరీతంగా ఆకర్షిస్తాయి. ఆ పంటలను ప్రధాన పొలంలో వేస్తే పురుగు రాకను, ఉనికిని వెంటనే గుర్తించవచ్చు. అటువంటి పంటలను ఎరపంటలు లేదా ఆకర్షక పంటలు అంటారు. ఎరపంటలు వేయడం వల్ల ప్రధాన పంటపై పురుగుల ఉద్ధృతి తగ్గుతుంది. అలాగే పురుగుమందులు వాడాల్సిన అవసరం, వాటి కొనుగోలుకు పెట్టే ఖర్చు తగ్గుతుంది. రైతులు ఈ ఎర పంటల ప్రాధాన్యాన్ని గుర్తించి ప్రధాన పంటలో వేసుకోవాలి.


