News April 16, 2025
వేటపాలెం: విద్యుత్ షాక్‌తో ఒకరి మృతి

విద్యుత్ వైరు తగిలి ఒక వ్యక్తి చనిపోయిన ఘటన వేటపాలెం మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ M. వెంకటేశ్వర్లు వివరాల ప్రకారం.. అనుమల్లి పేటకు చెందిన వ్యక్తి ఇంటికి వెళ్లే క్రమంలో వర్షం కారణంగా తెగిపడిపోయిన వైరు అడ్డంగా ఉండడాన్ని గమనించి దాన్ని తప్పించే క్రమంలో పట్టుకున్నాడు. ఈ క్రమంలో కరెంట్ షాక్ తగిలి బొడ్డు మోహన్ రావు మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.
Similar News
News September 16, 2025
డిజిటల్ అరెస్ట్ మోసాలకు జాగ్రత్త: వరంగల్ పోలీసుల హెచ్చరిక

వరంగల్ పోలీసులు ప్రజలకు ముఖ్య సూచనలు జారీ చేశారు. డిజిటల్ అరెస్టు పేరుతో ఎవరైనా కాల్ చేసి బెదిరించిన అసలు భయపడవద్దని వారు స్పష్టం చేశారు. ‘డిజిటల్ అరెస్ట్ అనే విధానం అసలు లేనిది. పోలీస్ యూనిఫాంలో ఎవరైనా వీడియో కాల్ చేసి మనీలాండరింగ్, డ్రగ్స్ కేసు అంటూ బెదిరిస్తే భయపడి డబ్బులు ఇవ్వొద్దు’ అని సూచించారు. ఇలాంటి మోసపూరిత కాల్స్ వస్తే వెంటనే 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు.
News September 16, 2025
కూతురు మృతి.. హీరో ఎమోషనల్ కామెంట్స్

చనిపోయిన తన కూతురు మీరాను మిస్సవ్వడం లేదని, ఆమె ఇంకా తనతోనే ఉన్నట్లు భావిస్తున్నానని తమిళ హీరో విజయ్ ఆంటోనీ తెలిపారు. ‘నేను కూతుర్ని కోల్పోలేదు. ఆమె నాతోనే ప్రయాణిస్తోంది. ఆమెతో రోజూ మాట్లాడుతున్నా. ఇందులో ఉన్న డెప్త్ మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు’ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. మీరా రెండేళ్ల క్రితం ఇంట్లో సూసైడ్ చేసుకోగా, తానూ ఆమెతోనే చనిపోయానని ఆ సమయంలో విజయ్ ఎమోషనల్ నోట్ విడుదల చేశారు.
News September 16, 2025
HYD: పడితే కుటుంబాలు రోడ్డున పడతాయ్!

ట్రాలీ నిండా సామాన్లు.. పైన కట్టెలు.. వాటిపైనే ప్రాణాలను ఫణంగా పెట్టిన కూలీలు. అదుపు తప్పితే వారితో పాటు కుటుంబాలు రోడ్డున పడతాయని మరిచిపోతే ఎలా అని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రవాణా నియమాలను పాటించాలని పోలీసులు చెబుతుంటే పెడచెవిన పెట్టి ప్రమదాలకు గురవుతున్నారు. ఫైన్‌లు వేసినా భయం లేదు. ఈ దృశ్యం పీర్జాదిగూడ పర్వతాపూర్‌లో కనిపించింది. ఇలాంటి ప్రయాణాలు విషాదాంతంగా మారుతాయని గుర్తించండి.