News April 16, 2025
న్యూ లుక్‌పై ట్రోల్స్.. ఖుష్బూ స్ట్రాంగ్ కౌంటర్

ట్రోలర్స్‌పై సీనియర్ నటి ఖుష్బూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సన్నగా మారిన తన న్యూ లుక్‌ను SMలో షేర్ చేయగా కొందరు ట్రోల్ చేశారు. ఇంజెక్షన్స్ చేసుకోవడం వల్లే ఈ మ్యాజిక్ జరిగిందంటూ ఒకరు కామెంట్ చేశారు. ‘మీరు అసలు ఎలాంటి మనుషులు? మీ ముఖాన్ని మీరు చూపించరు. ఎందుకంటే మీ వ్యక్తిత్వం ఎంత అసహ్యంగా ఉంటుందో మీకు తెలుసు. మీ పేరెంట్స్‌పై జాలేస్తోంది’ అంటూ ఖుష్బూ స్ట్రాంగ్ కౌంటరిచ్చారు.
Similar News
News April 19, 2025
వేమన పద్యం

ఉన్నతావు వదలి ఊరూరు దిరిగిన
కన్నదేమి నరుడు గ్రాసమునకు
తన్నులోను జూడ తమమెల్ల వీడును
విశ్వదాభిరామ వినుర వేమ.
భావం: ఉన్నచోటును విడిచి తీర్థయాత్రలు చేసినంత మాత్రాన ఉపయోగం లేదు. తనలో తాను చూసుకుంటే అజ్ఞానం తొలగిపోతుంది.
News April 19, 2025
ఆ హామీ ఇప్పట్లో అమలు కాకపోవచ్చు: కూనంనేని

TG: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన తులం బంగారం హామీ ఇప్పట్లో అమలు కాకపోవచ్చని MLA కూనంనేని సాంబ శివరావు అన్నారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం కూడా ప్రభుత్వానికి కష్టంగా ఉందని వ్యాఖ్యానించారు. ఖమ్మంలో విమానాశ్రయం ఏర్పాటు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ పరిస్థితి డోలాయమానంలో ఉందన్నారు. రాజీవ్ యువ వికాసం పథకం కోసం ఎవరికీ రుపాయి కూడా ఇవ్వొద్దని సూచించారు.
News April 19, 2025
ఇలా చేస్తే కోటీశ్వరులు కావొచ్చు!

పెట్టుబడుల కోసం చాలా మార్గాలున్నా, సిప్(SIP) అనేది దీర్ఘకాలంలో మంచి లాభాలు ఇస్తుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. మంచి స్టాక్స్‌ను సెలెక్ట్ చేసుకొని నెలకు రూ.20 వేల చొప్పున పెట్టుబడి పెట్టగలిగితే 15 ఏళ్లలో కోటి లేదా అంతకుమించి జమ చేసుకోవచ్చని తెలుపుతున్నారు. అయితే, మార్కెట్ల ఒడిదొడుకులు వల్ల స్వల్ప కాలంలో రాబడి ఉండదని, కనీసం పదేళ్లు కొనసాగిస్తామనే వారే SIP స్టార్ట్ చేయడం మంచిదని సూచిస్తున్నారు.