News April 16, 2025
సెలవుల్లో.. ములుగు స్వాగతం పలుకుతోంది!

వేసవి సెలవులకు ములుగు జిల్లా స్వాగతం పలుకుతోంది. సెలవుల్లో కుటుంబ సమేతంగా పచ్చని అడవుల్లో ఆహ్లాదకర వాతావరణంలో టూర్ ప్లాన్ చేసుకునేలా మంచి వేదిక కానుంది. వెంకటాపూర్‌లోని రామప్ప దేవాలయం, గోవిందరావుపేటలోని లక్నవరం సరస్సు, వేలాడే వంతెనలు, తాడ్వాయిలోని మేడారం సమ్మక్క-సారలమ్మ, మంగపేటలోని మల్లూరు నరసింహస్వామి పర్యాటక ప్రాంతాలు సందర్శించి, పచ్చని చెట్ల మధ్య విందు చేస్తూ ఆహ్లాదం పొందవచ్చు.
Similar News
News January 17, 2026
కొత్తగూడెం: పారదర్శకంగా మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లు: కలెక్టర్

కొత్తగూడెం కార్పొరేషన్, అశ్వరావుపేట, ఇల్లందు మున్సిపాలిటీల వార్డు రిజర్వేషన్లను శనివారం కలెక్టరేట్‌లో లాటరీ పద్ధతిలో ఖరారు చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం అత్యంత పారదర్శకతతో రిజర్వేషన్లను కేటాయించినట్లు కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. నిష్పక్షపాతంగా వార్డుల ఎంపిక జరిగిందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, వివిధ పార్టీల నేతలు పాల్గొన్నారు.
News January 17, 2026
U-19WC: భారత్ స్కోర్ ఎంతంటే?

U-19 వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచులో భారత్ 238 పరుగులకే ఆలౌట్ అయింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన మన జట్టులో కెప్టెన్ ఆయుష్ మాత్రే(6) మరోసారి ఫెయిల్ అయ్యారు. మరో ఓపెనర్ సూర్యవంశీ 72, అభిజ్ఞాన్ కుందు 80 రన్స్‌తో రాణించారు. మధ్యలో వర్షం వల్ల కాసేపు ఆటకు అంతరాయం ఏర్పడింది. దీంతో మ్యాచును 49 ఓవర్లకు కుదించారు. మరి భారత్ ఈ టార్గెట్‌ను కాపాడుకుంటుందా? COMMENT
News January 17, 2026
మద్దిలపాలెంలో బస్సు కింద పడి వ్యక్తి మృతి

విశాఖలోని మద్దిలపాలెంలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, స్కూటీ ఒకే దిశలో వెళ్తుండగా, స్కూటీ అదుపుతప్పి పల్సర్ వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో స్కూటీ నడుపుతున్న వ్యక్తి బస్సు వెనుక చక్రం కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక కూర్చున్న మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని.. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎంవీపీ సీఐ ప్రసాద్ తెలిపారు.


