News April 16, 2025
అక్రమ వలసదారులకు ట్రంప్ ఆఫర్

USలో చట్టవిరుద్ధంగా ఉంటూ సెల్ఫ్ డిపోర్టేషన్ (స్వీయ బహిష్కరణ) చేసుకునే వారికి ట్రంప్ ఆఫర్ ప్రకటించారు. సాధారణ పౌరులు తమ సొంత దేశానికి వెళ్లేందుకు విమాన ఖర్చులతో పాటు కొంత నగదు ఇస్తామని తెలిపారు. అలా వెళ్లిన వారిలో మంచివారుంటే చట్ట పద్ధతిలో వెనక్కి తిరిగిరావడానికి అనుమతిస్తామన్నారు. US నుంచి అక్రమ వలసదారులను వెనక్కి పంపడమే ప్రథమ లక్ష్యమని మరోసారి స్పష్టం చేశారు.
Similar News
News April 19, 2025
చిన్నస్వామిలో మారని RCB కథ!

IPL: PBKSపై ఓడిన RCB ఓ చెత్త రికార్డ్ మూటగట్టుకుంది. హోంగ్రౌండ్‌లో 46 మ్యాచులు ఓడిన జట్టుగా నిలిచింది. గతంతో ఈ రికార్డ్ ఢిల్లీ పేరిట ఉండేది. ఆ జట్టు అరుణ్‌జైట్లీ స్టేడియంలో 45 మ్యాచులు ఓడింది. కాగా, బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం చిన్నది కావడం RCBకి తొలి నుంచీ మైనస్సే అని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. గతంతో భారీ స్కోర్లు చేసినా డిఫెండ్ చేసుకోలేక చాలా మ్యాచ్‌లు ఓడిపోయిందని అంటున్నారు.
News April 19, 2025
వేమన పద్యం

ఉన్నతావు వదలి ఊరూరు దిరిగిన
కన్నదేమి నరుడు గ్రాసమునకు
తన్నులోను జూడ తమమెల్ల వీడును
విశ్వదాభిరామ వినుర వేమ.
భావం: ఉన్నచోటును విడిచి తీర్థయాత్రలు చేసినంత మాత్రాన ఉపయోగం లేదు. తనలో తాను చూసుకుంటే అజ్ఞానం తొలగిపోతుంది.
News April 19, 2025
ఆ హామీ ఇప్పట్లో అమలు కాకపోవచ్చు: కూనంనేని

TG: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన తులం బంగారం హామీ ఇప్పట్లో అమలు కాకపోవచ్చని MLA కూనంనేని సాంబ శివరావు అన్నారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం కూడా ప్రభుత్వానికి కష్టంగా ఉందని వ్యాఖ్యానించారు. ఖమ్మంలో విమానాశ్రయం ఏర్పాటు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ పరిస్థితి డోలాయమానంలో ఉందన్నారు. రాజీవ్ యువ వికాసం పథకం కోసం ఎవరికీ రుపాయి కూడా ఇవ్వొద్దని సూచించారు.