News April 16, 2025

వైజాగ్‌లో ముక్కామలకు చెందిన యువకుడి మృతి

image

వైజాగ్‌లోని దివీస్‌లో పనిచేస్తున్న పెరవలి మండలం ముక్కామలకు చెందిన మధు మోహన్ మంగళవారం మృతి చెందాడు. మోహన్ దివీస్‌లో పనిచేస్తూ హాస్టల్లో ఉంటున్నాడు. సోమవారం రాత్రి విధులు ముగించుకొని హాస్టల్‌కి వచ్చాడు. అనంతరం ఫోన్ మాట్లాడుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. భీమిలి పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు.

Similar News

News March 7, 2026

రాజమండ్రి: వాట్సాప్ ద్వారా టెన్త్ హాల్ టికెట్ పొందండిలా!

image

టెన్త్ పరీక్షలకు వెళ్లే విద్యార్థుల సౌకర్యార్ధం వాట్సాప్ గవర్నెన్స్ సేవల ద్వారా హాల్ టికెట్లు పొందే అవకాశం ప్రభుత్వం కల్పించినట్లు డీఈవో వాసుదేవరావు తెలిపారు. దీని కోసం 95523 00009 నంబర్ కు “Hi” అని మెసేజ్ పంపాలన్నారు. తదుపరి అందుబాటులో వచ్చే సేవల్లో “విద్యా సేవలు” ఎంపిక చేసి “SSC Hall Ticket” పై క్లిక్ చేయాలి. తర్వాత విద్యార్థి అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ నమోదు చేస్తే డౌన్‌లోడ్ అవుతుందన్నారు.

News March 7, 2026

పది పరీక్షలకు సర్వం సిద్ధం: కలెక్టర్‌ కీర్తి చేకూరి

image

మార్చి 16 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని తహశీల్దార్లను ఆదేశించారు. ప్రశ్నపత్రాల భద్రతకు స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద 24 గంటల పోలీసు పహారా, రవాణాకు ఎస్కార్ట్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కేంద్రాల్లో తాగునీరు, పారిశుద్ధ్యం మెరుగుపరచాలన్నారు.

News March 6, 2026

సకాలంలో ఇంటి పనులు చెల్లించాలి: కలెక్టర్ కీర్తి చేకూరి

image

జిల్లాలోని గ్రామాల్లో ఇంటి పన్నులు, ఇతర పన్నులు సకాలంలో చెల్లించి గ్రామ పంచాయితీలకు సహకరించాలని కలెక్టర్ కీర్తి చేకూరి శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. జిల్లాలోని 342 గ్రామ పంచాయితీలలో 2025-26 సంవత్సరానికి సంబంధించిన ఇంటి పన్నులు, ఇతర పన్నులు, గత సంవత్సరాల బకాయిలతో కలిపి మొత్తం రూ.126.71 కోట్లు వసూలు చేయాల్సి ఉందన్నారు. ఇప్పటి వరకు రూ.64.07 కోట్లు మాత్రమే వసూలు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.