News March 27, 2024
బద్వేలు కూటమి అభ్యర్థిగా బొజ్జా రోషన్న

కడప జిల్లా బద్వేలు నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా బీజేపీ నాయకుడు రోషన్నను ఆ పార్టీ అధిష్ఠానం ఎంపిక చేసింది. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా పలువురు బీజేపీ అభ్యర్థులను ప్రకటిస్తూ తుది జాబితాను వెలువరించిన నేపథ్యంలో బద్వేలు అభ్యర్థిగా రోషన్నను ఎంపిక చేసింది. ఇటీవలే ఆయన టీడీపీ నుంచి బీజేపీలోకి చేరారు.
Similar News
News March 16, 2026
సిద్ధవటం: ప్రారంభమైన పది పరీక్షలు

మండల కేంద్రమైన సిద్ధవటం జిల్లా పరిషత్ హైస్కూల్లో పదో తరగతి పరీక్షల సందర్భంగా సిద్ధవటం మండల ఎస్సై హారిక ఆధ్వర్యంలో పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. విద్యార్థుల హాల్ టికెట్లు చెక్ చేసి లోపలికి అనుమతించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఏఎస్ఐ సుబ్బరామచంద్ర, కొండయ్య, కానిస్టేబుల్ రాఘవ బందోబస్తులో పాల్గొన్నారు.
News March 16, 2026
నేటి ‘రైతన్నా మీకోసం వారోత్సవాలు’: కడప కలెక్టర్

సోమవారం నుంచి 25వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా ‘రైతన్నా మీకోసం వారోత్సవాలు’ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ శ్రీధర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి, రైతుల సమస్యలను నేరుగా తెలుసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వెల్లడించారు. ఖరీఫ్ సాగు పద్ధతులపై అవగాహన, పంటల ప్రణాళిక, ఆధునిక సాంకేతికతపై అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తారన్నారు.
News March 16, 2026
కడప: ‘ఓపెన్ 10th పరీక్షలకు 22 స్క్వాడ్లు ఏర్పాటు’

కడప జిల్లాలో ఓపెన్ 10th పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ నివారణకు 22 స్క్వాడ్లు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. కడపలో ఆదివారం 10th పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. 2,424 మంది విద్యార్థులు ఓపెన్ 10th పరీక్షలను 31 కేంద్రాల్లో రాయనున్నారు. పటిష్ఠంగా పరీక్షల నిర్వహణ కోసం 6 ఫ్లయింగ్, 16 సిట్టింగ్ స్క్వాడ్లు, 31 చీఫ్, డిపార్ట్మెంట్ అధికారులను నియమించామన్నారు.


