News April 16, 2025
కొత్తగూడెం: యువతిని మోసం చేశాడు

కొత్తగూడెం జిల్లా ఇల్లందుకి చెందిన ఏసుదాస్ డేవిడ్(43) పెళ్లి చేసుకుంటా అని యువతిని(21) గర్భవతిని చేశాడు. సీఐ జె.ఉపేందర్ వివరాలు.. ఇల్లెందుకు చెందిన బి.ఏసుదాస్ డేవిడ్ మల్లంపేటలో ఉంటూ ఓ యువతిని ప్రేమిస్తున్నా అంటూ శారీరికంగా వాడుకున్నాడు. పెళ్లి చేసుకోమని యువతి ఒత్తిడి తేవడంతోమొహం చాటేశాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అరెస్ట్ చేశారు.
Similar News
News January 5, 2026
అభివృద్ధి పనుల నివేదికలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలి: కలెక్టర్

ప్రభుత్వ పథకాల అమలుపై కలెక్టర్ అనుదీప్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆరు గ్యారెంటీలు, సన్నబియ్యం, రేషన్ కార్డుల పంపిణీ వివరాలను ప్రతి శుక్రవారం నియోజకవర్గాల వారీగా గూగుల్ షీట్‌లో అప్‌డేట్ చేయాలని ఆదేశించారు. చింతకానిలో నర్సింగ్ కాలేజీకి 3 ఎకరాలు, అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటుకు అవసరమైన స్థలాలను తక్షణమే గుర్తించాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. పనుల్లో జాప్యం వహించవద్దని స్పష్టం చేశారు.
News January 5, 2026
ఖమ్మం జిల్లాలో యూరియా కొరత లేదు: అదనపు కలెక్టర్

ఖమ్మం జిల్లా రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని, ఎవరూ ఆందోళన చెందవద్దని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి తెలిపారు. సోమవారం కొనిజర్ల మండలం పెదగోపతి, చింతకాని మండలం నాగిలిగొండలోని పంపిణీ కేంద్రాలను తనిఖీ చేశారు. జిల్లావ్యాప్తంగా 185 కేంద్రాల ద్వారా టోకెన్ల విధానంలో యూరియా సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు
News January 5, 2026
మహిళల భద్రతకు ‘పోష్’ కమిటీలు తప్పనిసరి: కలెక్టర్

పని ప్రదేశాల్లో మహిళలపై వేధింపులు నివారించేందుకు ‘పోష్’ చట్టం-2013ను కఠినంగా అమలు చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. 10 మంది కంటే ఎక్కువ సిబ్బంది ఉన్న ప్రతి కార్యాలయంలో అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఉండాలని, అందులో సగం మంది మహిళలే ఉండాలని స్పష్టం చేశారు. ప్రైవేట్ సంస్థలు నెల రోజుల్లోగా ఈ కమిటీలను ఏర్పాటు చేయాలని గడువు విధించారు.


