News April 16, 2025
సమ్మర్ హాలీడేస్.. అనకాపల్లిలో చూడదగ్గ ప్రదేశాలు

వేసవి సెలవుల్లో అనకాపల్లి జిల్లాలో సందర్శించేందుకు పలు పర్యాటక కేంద్రాలు స్వాగతం పలుకుతున్నాయి. అచ్యుతాపురం మండలం కొండకర్ల ఆవ ప్రకృతి అందాలతో అలరారుతుంది. ఆవలో బోటు షికారు మరుపురాని అనుభూతిని కలిగిస్తుంది. ప్రముఖ దేవాలయంగా పేరుగాంచిన అనకాపల్లి నూకాంబిక ఆలయాన్ని తప్పనిసరిగా సందర్శించాలి. నాతవరం మండలం తాండవ రిజర్వాయర్, ముత్యాలమ్మపాలెం, రేవు పోలవరం బీచ్‌లు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.
Similar News
News January 18, 2026
ASF: రేపు మంత్రి పర్యటన.. రూ.257.27 కోట్ల అభివృద్ధి పనులు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం ఆసిఫాబాద్ జిల్లాలో విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.257.27 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు పలు ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. కాగజ్‌నగర్, వాంకిడి, ఆసిఫాబాద్ మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.
News January 18, 2026
ఇరాన్ నిరసనల్లో 16,500 మంది మృతి?

ఇరాన్‌లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో భారీగా మరణాలు నమోదైనట్లు తెలుస్తోంది. ‘ఇప్పటిదాకా 16,500-18000 మంది ఆందోళనకారులు చనిపోయారని డాక్టర్లు చెబుతున్నారు. 3.6 లక్షల మంది వరకు గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది 30 ఏళ్ల లోపు వారే’ అని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. అధికారులు మిలిటరీ ఆయుధాలు వాడుతున్నారని, నిరసనకారుల తల, మెడ, ఛాతీ భాగాల్లో బుల్లెట్ గాయాలు ఉన్నాయని ఓ ప్రొఫెసర్ చెప్పినట్లు తెలిపింది.
News January 18, 2026
మేడారంలో కాసేపట్లో మంత్రివర్గ భేటీ

సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మేడారంలో తెలంగాణ మంత్రివర్గ సమావేశం కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ చారిత్రాత్మక సమావేశం కోసం మంత్రులు ఇప్పటికే మేడారం చేరుకున్నారు. సమ్మక్క-సారలమ్మ వనదేవతల చెంత జరగనున్న ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలపై ప్రభుత్వం చర్చించనుంది. సాయంత్రం వేళ మంత్రులు వనదేవతలకు మొక్కులు చెల్లించి, భేటీలో పాల్గొననున్నారు.


