News April 16, 2025
KMR: జిల్లాలో 43.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

కామారెడ్డి జిల్లాలో గత కొన్ని రోజులుగా తీవ్రమైన ఉష్ణోగ్రతల తాకిడికి గురవుతోంది. ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంగళవారం నస్రుల్లాబాద్‌లో అత్యధికంగా 43.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా అత్యల్పంగా పిట్లంలో 39.4°లుగా నమోదైంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో వాతావరణం భరించలేని విధంగా మారింది. రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి.
Similar News
News January 8, 2026
ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి గుడ్ న్యూస్

TG: ఏప్రిల్‌లో మరో విడత ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.22,500 కోట్లతో 4.5 లక్షల ఇళ్లు నిర్మించామని తెలిపారు. ప్రతి అర్హుడైన పేదవాడికి ఇల్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఏటా 2 విడతలుగా ఇళ్ల మంజూరు కొనసాగుతుందని, లబ్ధిదారులకు ప్రతి సోమవారం బిల్లులు చెల్లిస్తున్నామని అన్నారు.
News January 8, 2026
నేడు ఈ వస్తువులు దానం చేస్తే అదృష్టం

విష్ణువుకు ఇష్టమైన గురువారం నాడు పసుపు రంగు వస్తువులు దానమిస్తే జాతకంలో బృహస్పతి దోషాలు తొలగి, ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని నమ్మకం. పేదలకు పసుపు వస్త్రాలు, పప్పు ధాన్యాలు, అరటిపండ్లు, పసుపు మిఠాయిలను దానం చేయాలని పండితులు సూచిస్తున్నారు. దీనివల్ల వృత్తిలో పురోగతి లభించడమే కాకుండా, ఇంట్లో సిరిసంపదలు పెరుగుతాయని అంటున్నారు. స్తోమతను బట్టి చేసే దానం, విష్ణుమూర్తి కృపతో శుభాలను చేకూరుస్తుంది.
News January 8, 2026
ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం

దేశంలో తొలి వందే భారత్ స్లీపర్ ట్రైన్‌ను జనవరి 17న ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. గువాహటి-కోల్‌కతా రూట్‌లో 18 నుంచి పూర్తిస్థాయి సేవలు అందుబాటులోకి వస్తాయి. 16 కోచ్‌లు, 823 సీట్లు కలిగిన ఈ ట్రైన్‌లో విమాన తరహా సౌకర్యాలు, ఆటోమేటిక్ డోర్లు, మెరుగైన భద్రతా వ్యవస్థలు ఉన్నాయి. మధ్యతరగతి ప్రయాణికుల కోసం టికెట్ ధరలు రూ.2,300-3,600 మధ్య నిర్ణయించారు. గంటకు 180 KM వేగంతో దూసుకెళ్లనుంది.


