News April 16, 2025
ఔరంగజేబు సమాధిని రక్షించాలంటూ UNOకి లేఖ

MHలోని ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో ఉన్న ఔరంగజేబు సమాధిని రక్షించాలని కోరుతూ మెుఘల్ వారసుడు యాకుబ్ హబీబుద్దీన్ UNOకు లేఖ రాశారు. అసత్య ప్రచారాల వల్ల సమాధిని కూల్చివేయాలంటూ నిరసన ప్రదర్శనలు జరిగాయని లేఖలో తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ చట్టాలను అనుసరించి చారిత్రక కట్టడాలను కాపాడేలా ప్రత్యేక భద్రతను కల్పించాలని కోరారు. కాగా గత నెలలో ఔరంగజేబు సమాధి కేంద్రంగా మత ఘర్షణలు జరిగిన విషయం తెలిసిందే.
Similar News
News November 7, 2025
ధోనీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్!

క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోనీ వచ్చే ఐపీఎల్లో ఆడుతారా లేదా అనే సస్పెన్స్‌కు తెరపడింది. ఈ విషయంపై చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథన్ క్లారిటీ ఇచ్చారు. IPL-2026లో ధోనీ ఆడుతారని వెల్లడించారు. వచ్చే సీజన్‌కు అందుబాటులో ఉంటానని ఆయన తమకు సమాచారం ఇచ్చారని తెలిపారు. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ స్టార్ ప్లేయర్ సంజూ శాంసన్‌ను తీసుకునే అంశంపైనా సీఎస్కే చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
News November 7, 2025
₹1,01,899 CR పెట్టుబడులకు CBN ఆమోదం

AP: రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చేలా చూడడంతో పాటు పరిశ్రమలకు వేగంగా అనుమతులు ఇచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని CM CBN ఆదేశించారు. పారిశ్రామికవేత్తల నుంచి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలన్నారు. భూమి, ఇతర రాయితీలు పొందిన వాటిని సమీక్షించి పురోగతి లేకుంటే రద్దు చేయాలని SIPB భేటీలో స్పష్టం చేశారు. ల్యాండ్ బ్యాంకును ఏర్పాటుచేయాలని సూచించారు. కాగా భేటీలో ₹1,01,899 కోట్ల పెట్టుబడులను ఆమోదించారు.
News November 7, 2025
ఇతిహాసాలు క్విజ్ – 59 సమాధానాలు

1. అర్జునుడి శంఖం పేరు ‘దేవదత్తం’.
2. రుక్మిణి సోదరుడు ‘రుక్మి’.
3. అట్ల తద్ది పండుగ ‘ఆశ్వయుజ మాసం’లో వస్తుంది.
4. సుమంత్రుడు ‘దశరథుడి’ రథసారథి. రాముడి రథసారథిగా కూడా ఉన్నాడని కొందరు నమ్ముతారు.
5. తిరుపతిలో తలనీలాలు సమర్పించే స్థలాన్ని ‘కళ్యాణ కట్ట’ అని అంటారు.
<<-se>>#Ithihasaluquiz<<>>


