News April 16, 2025

బాలానగర్‌: ‘గల్లంతయిన రెండో వ్యక్తి మృతదేహం లభ్యం’

image

బాలానగర్ మండలంలోని గంగాధర్‌పల్లి గ్రామ శివారులో చేపల వేటకు వెళ్లి ఇద్దరు గల్లంతైన ఘటన సోమవారం జరిగిన సంగతి తెలిసిందే. ఎస్ఐ లెనిన్ ఆధ్వర్యంలో మంగళ, బుధవారాలలో ఎన్డీఆర్‌ఎఫ్, ఫైర్ సిబ్బందితో గాలింపు చేపట్టారు. నిన్న సాయంత్రం శివరాములు మృతదేహం లభ్యం కాగా.. బుధవారం ఉదయం యాదయ్య (25) మృతదేహం లభ్యమయ్యింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Similar News

News December 24, 2025

MBNR: పీయూలో అథ్లెటిక్స్‌ ఎంపికలు ప్రారంభం

image

పాలమూరు విశ్వవిద్యాలయంలోని సింథటిక్ మైదానంలో దక్షిణ మండల అంతర్ విశ్వవిద్యాలయాల అథ్లెటిక్స్ (మహిళల) జట్టు ఎంపికలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. వీసీ ప్రొఫెసర్ జీఎన్ శ్రీనివాస్ హాజరై క్రీడలను ప్రారంభించారు. వర్సిటీలో అత్యాధునిక సింథటిక్ ట్రాక్ అందుబాటులో ఉండటం క్రీడాకారులకు వరం లాంటిదన్నారు. క్రీడాకారులు తమ ప్రతిభను చాటి విశ్వవిద్యాలయానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు.

News December 23, 2025

పాలమూరు యూనివర్సిటీలో అథ్లెటిక్స్ సెలక్షన్స్

image

ఏఐయూ టోర్నమెంట్ల కోసం జిల్లాలోని పాలమూరు యూనివర్సిటీలో అథ్లెటిక్స్ (పురుషులు) సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించారు. ఉపకులపతి ప్రొఫెసర్ జి.ఎన్.శ్రీనివాస్ క్రీడాకారులను అభినందించారు. ఎంపికైన వారు జనవరి 12-16 వరకు బెంగళూరులో జరిగే ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ పోటీల్లో పాల్గొంటారు. ఈనెల 24న అథ్లెటిక్స్ ఉమెన్స్, 29న ఉమెన్స్ క్రికెట్ సెలక్షన్లు ఉంటాయని ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ వై.శ్రీనివాసులు తెలిపారు.

News December 22, 2025

పాలమూరు యూనివర్సిటీ.. రేపు ‘అథ్లెటిక్స్’ ఎంపికలు

image

పీయూ పురుషుల అథ్లెటిక్స్ ఎంపికలు ఈనెల 23న యూనివర్సిటీలోని సింథటిక్ మైదానంలో జరగనుంది. సౌత్ జోన్ ఆలిండియా పోటీల్లో పాల్గొనే క్రీడాకారులను ఎంపిక చేయనున్నట్లు PD డా.వై.శ్రీనివాసులు ‘Way2News’ ప్రతినిధితో తెలిపారు. ముఖ్యఅతిథిగా VC ప్రొఫెసర్ జీఎన్.శ్రీనివాస్ హాజరుకానున్నారు. 17-25 ఏళ్ల లోపు వయసున్న క్రీడాకారులు అర్హులని, ఆసక్తి గల వారు బోనఫైడ్, టెన్త్ మెమో, ఎలిజిబిలిటీ ఫామ్‌లతో హాజరుకావాలని సూచించారు.