News March 27, 2024
లైసెన్స్ కలిగిన ఆయుధాలను ప్రదర్శించకూడదు: కలెక్టర్

జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ విధించినట్లు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ప్రజలు లైసెన్స్ కలిగిన ఆయుధాలు వారీ వెంట తీసుకువెళ్లడం ప్రదర్శించుట చేయరాదన్నారు. నిషేధాజ్ఞలు ఎన్నికల ఫలితాల ప్రకటన తేదీ వరకు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
Similar News
News September 8, 2025
రేపు యథావిధిగా పీజీఆర్ఎస్: కలెక్టర్

భీమవరం కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తారని చెప్పారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె సూచించారు. అలాగే 1100 నంబర్‌కు కాల్ చేసి కూడా తమ సమస్యలు తెలియజేయవచ్చని కలెక్టర్ అన్నారు.
News September 7, 2025
రైతులకు యూరియా కొరత లేకుండా చూస్తాం: కలెక్టర్

రైతులకు యూరియా కొరత లేకుండా అందిస్తున్నామని కలెక్టర్ సి.నాగరాణి అన్నారు. కాళ్ల మండలం కోపల్లె సొసైటీలో యూరియా వినియోగంపై జరిగిన అవగాహన సదస్సులో ఆమె పాల్గొన్నారు. సొసైటీ గోడౌన్‌లోని ఎరువుల నిల్వలను తనిఖీ చేశారు. అధికారుల సూచనల మేరకు ఎరువులను వినియోగించుకుని అధిక దిగుబడులు సాధించాలని ఆమె రైతులకు సూచించారు. సొసైటీ ఛైర్మన్ పాల్గొన్నారు.
News September 7, 2025
పెదతాడేపల్లి గురుకుల పాఠశాల పీజీటీ సస్పెండ్

తాడేపల్లిగూడెం (M) పెదతాడేపల్లి డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల పీజీటీ భీమడోలు రాజారావును జిల్లా కలెక్టర్ నాగరాణి సస్పెండ్ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాలకు చెందిన బ్యాగ్ పైపర్ బ్యాండ్ విద్యార్థుల బృందాన్ని నరసాపురంలోని ఒక ప్రైవేట్ కళాశాలకు తీసుకెళ్లినందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. అలాగే, జిల్లా కోఆర్డినేటర్ ఉమా కుమారికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు.