News March 27, 2024

పెదవేగి: భార్యను హత్య చేసిన ముద్దాయికి యావజ్జీవ కారాగార శిక్ష

image

పెదవేగి మండలంలో భార్యను హత్య చేసిన ముద్దాయికి యావజ్జీవ కారాగార శిక్ష రూ.1000 జరిమానా విధించినట్లు ఎస్పీ మేరీ ప్రశాంతి చెప్పారు. ఆమె మాట్లాడుతూ.. తాళ్లూరి రోజా కుటుంబ కలహాల మధ్య తల్లిదండ్రుల వద్ద నివాసం ఉంటుంది. ఏసు తన భార్యపై అనుమానంతో రాత్రి 11గంటలకు సమయంలో కొబ్బరిబోండాలు కొట్టే కత్తితో మెడపై నరకగా రోజా అక్కడికక్కడే మృతిచెందింది. విచారించిన అనంతరం కోర్టు శిక్ష విధించినట్లు ఎస్పీ తెలిపారు. 

Similar News

News February 8, 2025

నరసాపురం: ఉత్సవ ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ 

image

నరసాపురంలోని మాధవాయిపాలెం – సఖినేటిపల్లి రేవును శుక్రవారం ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి ఆకస్మికంగా తనిఖీ చేశారు. బందోబస్తు విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి పలు సూచనలు చేశారు. లక్ష్మీ నరసింహ స్వామి ఉత్సవాలు పూర్తయ్యేంతవరకు ప్రణాళికా బద్ధంగా పనిచేస్తూ, కట్టుదిట్టమైన బందోబస్తు నిర్వహించాలని ఎస్పీ ఆదేశించారు. భక్తులు పోలీస్ వారి సూచనలను పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ఎస్పీ తెలిపారు. 

News February 7, 2025

మంత్రి నిమ్మలకు 22వ ర్యాంకు పట్ల ఆశ్చర్యం!

image

ఫైళ్ల క్లియరెన్స్‌పై CM చంద్రబాబు ప్రకటించిన ర్యాంకుల్లో నిమ్మల రామానాయుడికి 22వ ర్యాంకు లభించడం పట్ల ప.గో జిల్లా వాసులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎప్పుడూ జలవనరుల శాఖకు సంబంధించిన వ్యవహారాల్లో నిమ్మల చురుకుగా కనిపిస్తూ ఉంటారు. అయితే ప్రాజెక్టులు, ఎత్తిపోతలు వంటి అంశాల్లో ప్రభుత్వ పెద్దలతో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో ఫైళ్ల క్లియరెన్స్‌లో వెనకబడాల్సి వచ్చిందని విశ్లేషకులు అంటున్నారు.

News February 7, 2025

దొంగలను చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు

image

ఏలూరులోని నగల దుకాణంలో భారీ చోరీకి పాల్పడిన<<15384948>> దొంగలను<<>> పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితులు అంతర్‌రాష్ట్ర ముఠాగా గుర్తించిన పోలీసులు వారు ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉన్నట్లు తెలిసి అక్కడకు వెళ్లారు. వారి గ్రామాల సమీపంలో మాటు వేసి పట్టుకున్నారు. నిందితులపై ఏలూరు పరిధిలో దాదాపు 10 కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారి నుంచి 469 గ్రాముల బంగారు ఆభరణాలు, 41 కేజీల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు

error: Content is protected !!