News April 16, 2025
నాగర్‌కర్నూల్: యాక్సిడెంట్‌లో చనిపోయింది వీళ్లే..!

నాగర్‌కర్నూల్ జిల్లా చారకొండ-దేవరకొండ రోడ్డులో <<16112661>>ఎర్రగుంటపల్లి వద్ద<<>> మంగళవారం రాత్రి జరిగిన యాక్సిడెంట్‌లో ఇద్దరు చనిపోయిన విషయం తెలిసిందే. స్థానికులు తెలిపిన వివరాలు.. కల్వకుర్తికి చెందిన కార్తిక్, అరవింద్ పని నిమిత్తం బైక్‌పై దేవరకొండకు వెళ్లారు. తిరిగొస్తుండగా గుర్తు తెలియని వాహనం వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న ఇద్దరు చనిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News September 17, 2025
మైథాలజీ క్విజ్ – 8 సమాధానాలు

1. మైథిలి అంటే ‘సీతాదేవి’. మిథిలా నగరానికి రాజైన జనకుడి పుత్రిక కాబట్టి ఆమెను మైథిలి అని పిలుస్తారు.
2. కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల ప్రధాన సైన్యాధిపతి ‘ధృష్టద్యుమ్నుడు’. ఆయన ద్రౌపదికి సోదరుడు.
3. ‘పూతన’ అనే రాక్షసిని చంపింది శ్రీకృష్ణుడు.
4. విష్ణువు శయనించే పాము పేరు ‘ఆది శేషుడు’. ఈ సర్పానికి ‘అనంత’ అనే పేరు కూడా ఉంది.
5. బృహదీశ్వర ఆలయం తమిళనాడులోని తంజావూరు నగరంలో ఉంది. <<-se>>#mythologyquiz<<>>
News September 17, 2025
కృష్ణా: రైలులో గంజాయి అక్రమ రవాణా.. ఒకరి అరెస్ట్

కృష్ణా జిల్లా వ్యాప్తంగా గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలో, బిలాస్‌పూర్ నుంచి తిరుపతి వెళ్లే రైలులో 4.5 కిలోల గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఒక వ్యక్తిని రామవరప్పాడు రైల్వే స్టేషన్‌లో అరెస్ట్ చేశారు. నిందితుడిని జీఆర్‌పీ పోలీసులకు అప్పగించారు. విచారణలో ఒరిస్సాలోని చాట్ల గ్రామంలో గంజాయి కొనుగోలు చేసి, చిత్తూరు జిల్లాలో విక్రయిస్తున్నట్లు అతడు తెలిపాడు.
News September 17, 2025
మేడారానికి ఓకే విడతలో రూ.150 కోట్లు: సీతక్క

ములుగు జిల్లా అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి సహకారం అందిస్తున్నారని మంత్రి సీతక్క అన్నారు. మేడారం జాతరకు ఒకే విడతలో రూ.150 కోట్లు, రోడ్లకు రూ.50 కోట్లు ఇచ్చారని తెలిపారు. ములుగు పట్టణంలో పంచాయతీ రోడ్లకు రూ.40 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. అధికారులు ప్రజాపాలనలో భాగస్వామ్యం కావాలని కోరారు. ములుగు జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రణాళిక రూపొందించామని పేర్కొన్నారు.