News April 16, 2025

నాగర్‌కర్నూల్: యాక్సిడెంట్‌లో చనిపోయింది వీళ్లే..!

image

నాగర్‌కర్నూల్ జిల్లా చారకొండ-దేవరకొండ రోడ్డులో <<16112661>>ఎర్రగుంటపల్లి<<>> వద్ద మంగళవారం రాత్రి జరిగిన యాక్సిడెంట్‌లో ఇద్దరు చనిపోయిన విషయం తెలిసిందే. స్థానికులు తెలిపిన వివరాలు.. కల్వకుర్తికి చెందిన కార్తిక్, అరవింద్ పని నిమిత్తం బైక్‌పై దేవరకొండకు వెళ్లారు. తిరిగొస్తుండగా గుర్తు తెలియని వాహనం వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న ఇద్దరు చనిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News November 4, 2025

ఇంటర్ బోర్డు ఆదేశాలు తప్పనిసరి: డీఐఈఓ

image

ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాలల్లో బోర్డు ఆదేశాలను తప్పక పాటించాలని డీఐఈఓ శ్రీధర్ సుమన్ అన్నారు. ఆయన మంగళవారం పర్వతగిరి, నెక్కొండ కళాశాలలను సందర్శించి అడ్మిషన్ల ప్రక్రియ, తరగతులు, వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి, మానసిక వికాసానికి కృషి చేయాలని అధ్యాపకులకు సూచించారు.

News November 4, 2025

భూపాలపల్లి: నర్సింగ్ ఆఫీసర్ అనుమానాస్పద మృతి

image

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ 100 పడకల హాస్పిటల్‌లో నర్సింగ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న అనిత ఆత్మహత్య చేసుకుంది. మంజుర్ నగర్లోని తన ఇంట్లో ఉరివేసుకొని ఆమె అనుమానాస్పద రీతిలో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News November 4, 2025

సైన్యాన్ని కూడా ఆ 10% మందే నియంత్రిస్తున్నారు: రాహుల్

image

బిహార్ ఎన్నికల ప్రచారంలో CONG నేత రాహుల్ గాంధీ చేసిన కామెంట్లపై దుమారం రేగుతోంది. ‘దేశంలోని 10% జనాభాకే (అగ్రవర్ణాలు) కార్పొరేట్ సెక్టార్, బ్యూరోక్రసీ, జుడీషియరీలో అవకాశాలు దక్కుతున్నాయి. చివరకు ఆర్మీ కూడా వారి కంట్రోల్‌లోనే ఉంది’ అని ఆయన వ్యాఖ్యానించారు. 90% ఉన్న SC, ST, BC, మైనారిటీలు కనిపించరని పేర్కొన్నారు. కాగా భారత సైనికుల్ని చైనా సైన్యం కొడుతోందని ఇదివరకు RG కామెంట్ చేయగా SC మందలించింది.