News April 16, 2025
సిరిసిల్ల లేదా హస్నాబాద్లో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాలి: బండి సంజయ్

సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను కేంద్రమంత్రి బండి సంజయ్ కోరారు. బుధవారం ఆయనకు దిల్లీలో బండి వినతిపత్రం సమర్పించారు. ఈ స్కూల్ వల్ల గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్య, దేశభక్తి, నాయకత్వ శిక్షణ లభిస్తుందన్నారు. మంత్రి రాజ్నాథ్ సింగ్ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.
Similar News
News November 8, 2025
పెందుర్తి: దొంగా-పోలీసు ఆడుదాం అంటూ చంపేసింది

పెందుర్తిలో సొంత అత్తనే కోడలు హత్య చేసిన విషయం <<18232660>>తెలిసిందే<<>>. భర్త పని నిమిత్తం బయటకు వెళ్లిన తర్వాత తన కుమార్తె, అత్త కనకమహాలక్ష్మితో కలిసి దొంగా-పోలీసు ఆట ఆడుదామని లలితా దేవి పిలిచింది. అనంతరం అత్త కాళ్లకు తాళ్లు కట్టి పెట్రోల్ పోసి నిప్పు అంటించింది. విచారణకు వచ్చిన పోలీసులకు దేవుడి గదిలో దీపం పడడంతో కాలిపోయినట్లు స్టోరీ అల్లింది. దర్యాప్తు చేయగా.. అసలు నిజం బయటపడింది.
News November 8, 2025
21న సిరిసిల్ల-గోవా స్పెషల్ టూర్

ఆర్టీసీ సిరిసిల్ల డిపో నుంచి ఈనెల 21వ తేదీ శుక్రవారం గోవాకు ప్రత్యేక ప్యాకేజీ టూర్ నిర్వహించనున్నారు. బీదర్, హుమ్నాబాద్, గానుగపూర్, మురుడేశ్వర్, గోకర్ణ, గోవా, పండరీపూర్, తుల్జాపూర్ సందర్శన అనంతరం తిరిగి 24న సిరిసిల్ల చేరుకుంటుంది. పెద్దలకు రూ.3900/-, పిల్లలకు 2750/- చార్జి ఉంటుందని, వసతి భోజన ఖర్చులు ప్రయాణికులు భరించాల్సి ఉంటుందని సిరిసిల్ల డిపో మేనేజర్ ప్రకాష్ రావు తెలిపారు.
News November 8, 2025
రబీ శనగ సాగుకు అనువైన రకాలు

రబీలో నవంబర్ 15 లోపు వరకు శనగ పంటను విత్తుకోవచ్చు.
☛ రబీకి అనువైన దేశీ శనగ రకాలు నంద్యాల శనగ-1, జెబి-11, జెఎకెఐ-9218, జెబి-130, ధీర, నంద్యాల గ్రామ్-49, నంద్యాల గ్రామ్- 452, నంద్యాలగ్రామ్-776(N.B.E.G)-776.
☛ కాబులి రకాలు: కెఎకె-2, పూలెజి-95311, లాం శనగ-7 (ఎల్బిఇజి-7), నంద్యాల గ్రామ్-119(N.B.E.G-119), నంద్యాల గ్రామ్-810 (N.B.E.G-810)


