News April 16, 2025
పార్కింగ్ స్థలాన్ని పరిశీలించిన మాజీ మంత్రులు

రజతోత్సవ సభకు వేలాది వాహనాలు తరలివస్తాయని, పార్కింగ్‌కు ఎలాంటి ఇబ్బందులు కలగవద్దని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బుధవారం ఎల్కతుర్తి రజతోత్సవ సభ ప్రాంగణంలోని పార్కింగ్ స్థలాన్ని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ తో కలిసి ఆయన పరిశీలించారు. వచ్చే కార్యకర్తలకు, సామాన్యులకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా పార్కింగ్ ఏర్పాట్లు పకడ్బందీగా ఉండేలా చూడాలని సూచించారు.
Similar News
News July 5, 2025
ADB: బయట పడుతున్న అధికారుల అవినీతి భాగోతాలు

ఉమ్మడి ADB జిల్లాలో ACB అధికారుల దాడుల్లో ప్రభుత్వ అధికారులు చిక్కుతున్నారు. అయినా కూడా ఎలాంటి మార్పు రావడం లేదు. మంచిర్యాల జిల్లా కోటపల్లి కార్యాలయంలో డిప్యూటీ తహశీల్దార్ నవీన్ కుమార్‌ను ACB అధికారులు శుక్రవారం పట్టుకున్నారు. భీమారానికి చెందిన గంట నరేశ్(రైతు) భూమి పట్టాపాసుబుక్కు ఈకేవైసీ నిమిత్తం DTని సంప్రదించగా రూ.10వేలు లంచం అడిగాడు. దీంతో రైతు ACB అధికారులను ఆశ్రయించగా DTని పట్టుకున్నారు.
News July 5, 2025
ఒకట్రెండు రోజుల్లో KCR ప్రెస్‌మీట్!

TG: అనారోగ్యం నుంచి కోలుకున్న మాజీ సీఎం KCR నిన్న యశోద ఆసుపత్రిలోనే పలువురు పార్టీ నేతలతో సమావేశమయ్యారు. తెలంగాణ జల హక్కులపై వాస్తవాలు బయటపెడతానని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతానని స్పష్టం చేశారు. దీంతో ఆయన ఒకట్రెండు రోజుల్లో మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఇవాళ ఉ.11 గంటలకు తెలంగాణ భవన్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు.
News July 5, 2025
పరీక్షల తేదీలు వచ్చేశాయి

AP: ప్రభుత్వ డిగ్రీ, జూనియర్, పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్ల పోస్టుల భర్తీకి రాత పరీక్షల సవరణ <