News April 16, 2025
పార్వతీపురం: ‘చిన్నారుల పెరుగుదలపై దృష్టి సారించాలి’

అంగన్వాడీ కేంద్రాల్లో చదువుతున్న చిన్నారుల బరువు, పెరుగుదల వయస్సు తగిన విధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ మేరకు సంబంధిత శాఖ అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఏ అంగన్వాడీ కేంద్రంలో అయితే నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా చిన్నారుల బరువు, పెరుగుదల ఉండదో అందుకు సూపర్వైజర్‌లు బాధ్యత వహిస్తారని ఆయన స్పష్టం చేశారు.
Similar News
News July 5, 2025
GWL: కట్టుకున్న వారే కడతేర్చుతున్నారు!

జీవితాంతం కలిసుంటామని పెళ్లిలో ప్రమాణం చేసిన భార్యాభర్తలు కట్టుకున్న వారినే కడ తేర్చుతున్నారు. నడిగడ్డలో ఇటీవల జరిగిన ఘటనలు వణుకుపుట్టిస్తున్నాయి. GWLలో తేజేశ్వర్‌ను భార్య ఐశ్వర్య తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని హత్య చేయించింది. అయిజ మాలపేటలో మాజీ భార్య సరోజ ప్రవర్తన సరిగా లేదని, కుమారుడికి పెళ్లి కావడంలేదని తండ్రీకొడుకులు కలిసి హత్య చేశారు. దీంతో పెళ్లిచేసుకోవాలంటేనే యువతలో భయం పుడుతోంది.
News July 5, 2025
ఆ 11 మంది ఏమయ్యారు?

TG: పాశమైలారం సిగాచీ కంపెనీలో జరిగిన ఘోర ప్రమాదంలో 11 మంది ఆచూకీ లభించడంలేదు. 39 మంది మరణించినట్లు అధికారులు ప్రకటించగా, కనిపించకుండా పోయినవారి శరీర భాగాల్లో చిన్న ముక్క కూడా దొరకలేదు. దీంతో వారు కాలి బూడిదయ్యారా? లేక ఏమయ్యారు? అనేది తెలియడంలేదు. వారి అవశేషాల కోసం ఘటనాస్థలంలో మరోసారి వెతికినా ఫలితం లేకపోయింది. దీంతో బాధిత కుటుంబీకులకు ఏం చెప్పాలో తెలియక అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.
News July 5, 2025
KNR: రేపు జూనియర్ బాలబాలికల నేషనల్ హాకీ సెలక్షన్స్

సికింద్రాబాద్ రైల్వే గ్రౌండ్‌లో జూనియర్ బాలబాలికల నేషనల్ హాకీ సెలక్షన్ ట్రయల్స్ ఆదివారం నిర్వహించనునట్లు జిల్లా హాకి జాయింట్ సెక్రటరీ తిరున హరి శ్రీనివాస్ తెలిపారు. ఈ హాకీ ట్రయల్స్ కోసం ఆసక్తి గల జిల్లాలోని హాకీ క్రీడాకారులు తమ పేర్లను జిల్లా ఇన్ఛార్జి సెక్రటరీ అలీ వద్ద నమోదు చేసుకోవాలని సూచించారు. మరింత సమాచారం కోసం 7075667465, 9949029440 నంబర్లను సంప్రదించాలని కోరారు.