News April 16, 2025

ఏలూరు: గుర్తు తెలియని వ్యక్తి మృతి 

image

గుర్తు తెలియని మృతదేహం అస్థి పంజరg స్థితిలో లభ్యమైన ఘటన ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి కొత్తూరు ఇందిరా కాలనీ సమీపంలో ఉన్న పంట పొలాలలో బుధవారం సాయంత్రం లభ్యమైంది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఏలూరు రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతి చెంది సుమారు నెలకు పైగా కావొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News November 12, 2025

HYD: డ్రగ్‌ కేసులో నైజీరియన్ డిపోర్టేషన్

image

హైదరాబాద్‌ H-NEW పోలీసులు డ్రగ్‌ కేసులో నైజీరియన్ ఒన్యేవుకూ కెలెచి విక్టర్ను అదుపులోకి తీసుకున్నారు. వీసా గడువు ముగిసినా అక్రమంగా భారత్‌లో ఉండి డ్రగ్‌ సరఫరాలో పాల్గొన్నట్లు విచారణలో తేలింది. FRRO సహకారంతో అతడిని డిపార్ట్‌ చేసినట్లు అధికారులు తెలిపారు. నైజీరియన్స్ అనుమానాస్పదంగా కనబడితే తప్పకుండా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు.

News November 12, 2025

రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి: MHBD కలెక్టర్

image

కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని మహబూబాబాద్ కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. ఈమేరకు నెల్లికుదురు మండలకేంద్రం, రామన్నగూడెంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోళ్ల కేంద్రాలను వారు సందర్శించారు. అదేవిధంగా మండలంలోని కేజీబీవీ పాఠశాలను కూడా సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందుతున్న సౌకర్యాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

News November 12, 2025

ADB: KU పరీక్షల షెడ్యూల్ విడుదల

image

కాకతీయ యూనివర్సిటీ (కేయూ) పరిధిలో బీఏ, బీకాం, బీఎస్సీ సహా ఇతర డిగ్రీ కోర్సుల 1, 3, 5వ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 18 నుంచి ప్రారంభమవుతాయని పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కట్ల రాజేందర్ తెలిపారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లోని కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. వివరాలు కేయూ వెబ్‌సైట్‌లో ఉన్నాయన్నారు.