News April 16, 2025
కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి: అ.కలెక్టర్

మునగాల మండల బరాఖత్ గూడెం గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో తేమ శాతాన్ని పరిశీలించారు. అనంతరం రైతులతో మాట్లాడుతూ.. రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని సూచించారు.
Similar News
News April 19, 2025
ఖమ్మంలో 10 ఆసుపత్రులు సీజ్ : DMHO

CMRF బిల్లుల జారీలో అవకతవకలకు పాల్పడిన ఖమ్మంలోని 10 ఆసుపత్రులను మూసివేసినట్లు DMHO డా.కళావతి బాయి తెలిపారు. శ్రీ వినాయక, శ్రీకర మల్టీ స్పెషాలిటీ, సాయిమల్టీ స్పెషాలిటీ, వైష్ణవి, సుజాత, ఆరెంజ్, న్యూ అమృత, మేఘ, JR ప్రసాద్, గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల రిజిస్ట్రేషన్లను రద్దుచేసి మూసివేసినట్లు చెప్పారు. చికిత్సలు చేయకుండానే నకిలీ బిల్లును సృష్టించి CMRF నిధులను కాజేశారని పేర్కొన్నారు.
News April 19, 2025
కర్నూలులో క్యాన్సర్ హాస్పిటల్ ప్రారంభం

కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో శనివారం నూతన క్యాన్సర్ ఆస్పత్రి ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, మంత్రి టీజీ భరత్‌తో కలిసి ముఖ్యఅతిథిగా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత పాల్గొన్నారు. అనంతరం నూతన ఆస్పత్రి భవనాన్ని సందర్శించి అక్కడ ఉండే వసతుల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ఆమె సూచించారు.
News April 19, 2025
IPL: ముగిసిన డీసీ ఇన్నింగ్స్.. స్కోర్ ఎంతంటే..

అహ్మదాబాద్‌లో జరుగుతున్న IPL మ్యాచ్‌లో డీసీ బ్యాటింగ్ ముగిసింది. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి ఢిల్లీ 203 పరుగులు చేసింది. అశుతోశ్ (19 బంతుల్లో 37), అక్షర్ (32 బంతుల్లో 39), నాయర్ (18 బంతుల్లో 31) రాణించారు. GT బౌలర్లలో ప్రసిద్ధ్ 4, సిరాజ్, అర్షద్, ఇషాంత్, సాయి కిశోర్ తలో వికెట్ తీసుకున్నారు. GT విజయ లక్ష్యం 204 పరుగులు.